13వ అంతస్తులో ఏం జరిగింది? | lady felt from 13th floar balcony and died | Sakshi
Sakshi News home page

13వ అంతస్తులో ఏం జరిగింది?

Published Wed, Jul 20 2016 8:40 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

రిచాగుప్తా మృతదేహం - Sakshi

రిచాగుప్తా మృతదేహం

చందానగర్‌: బాల్కనీలో దుస్తులు ఆరవేస్తూ ఓ యువతి 13వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. చందానగర్‌ సీఐ తిరుపతిరావు కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిచా గుప్తా(17) నల్లగండ్ల అపర్ణ సరోవర్‌ లెక్‌వ్యూ అపార్ట్‌మెంట్‌లో ఉండే తన అక్కాబావల వద్దకు 15 రోజుల క్రితం వచ్చింది. మంగళవారం రాత్రి 8 గంటలకు తాము నివాసం ఉండే 13వ అంతస్తులోని బాల్కనీలో దుస్తులు ఆరవేస్తూ అక్కడి నుంచి కిందపడి అక్కడికక్కడే చనిపోయింది. దుస్తులు ఆరవేస్తూ కిందపడి చనిపోయిందా? లేక మరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement