ఈ ప్యాంటు కొవ్వును కరిగిస్తుంది | Trousers can be Dissolved human cholesterol | Sakshi
Sakshi News home page

ఈ ప్యాంటు కొవ్వును కరిగిస్తుంది

Published Fri, Jun 6 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

ఈ ప్యాంటు కొవ్వును కరిగిస్తుంది

ఈ ప్యాంటు కొవ్వును కరిగిస్తుంది

నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఇతర ఎక్సర్‌సైజులు చేస్తున్నప్పుడు ఈ ప్యాంటును ధరిస్తే.. ఇది మన శరీరంలోని కొవ్వును కరిగిస్తుందట! ‘స్కినెసియాలజీ ప్యాంటు’గా పేరుపెట్టిన దీనిని న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు తయారు చేశారు. అంతర్గతంగా రబ్బరు బ్యాండ్లతో ఉండే ఈ దుస్తులు కండరాలపై ఒత్తిడి పెంచి, వాటి కదలికలను కొద్దిగా అడ్డుకోవడం ద్వారా కొవ్వు కరిగిపోయేలా చేస్తాయట.
 
 అయితే ఈ దుస్తులు ఎక్సర్‌సైజులకు ప్రత్యామ్నాయం కాదని.. పలు ఎక్సర్‌సైజులు చేస్తున్నప్పుడు అదనపు కసరత్తు మాదిరిగా మాత్రమే ఇవి పనికొస్తాయని చెబుతున్నారు. మామూలుగా వ్యాయామం చేయలేనివారికీ ఉపయోగకరమని అంటున్నారు. సాధారణ దుస్తులతో వ్యాయామం చేసినప్పటి కన్నా.. వీటిని ధరించినప్పుడు 20 శాతం కొవ్వు అదనంగా కరుగుతుందట. వీటిని త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement