
పుట్టినరోజు, ఫ్యామిలీ గెట్ టు గెదర్స్, క్రిస్టమస్, న్యూ ఇయర్ ఇలా ఈ నెలలో వచ్చే వేడుకల జాబితా ఎక్కువే. ఈ సందర్భాలలో పిల్లల దుస్తుల విషయంలో అమ్మలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. వేడుక ఏదైనా నలుగురిలో తమ చిన్నారులు మరింతగా వెలిగిపోవాలని కోరుకుంటారు. పిల్లలకు సౌకర్యంతో పాటు గ్రాండ్‌గా ఉండే కుచ్చుల గౌన్లు ఇవి..
సౌకర్యం ముఖ్యం
పిల్లలకు ఏ దుస్తులు సౌకర్యంగా ఉంటే ఆ డ్రెస్‌లో ఎక్కువ సేపు ఉంటారు. సాధారణంగా కాటన్, ఖాదీ బట్టలైతే వారి లేత చర్మానికి గుచ్చుకోవు. వీటిని బేస్ చేసుకుంటూ పిల్లల కోసం నెటెడ్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన ఈవెనింగ్ పార్టీవేర్ ఇది.
కుచ్చుల వేడుక...
వేడుకలో పిల్లలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా కనిపించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లలు కూడా నలుగురిలో తిరుగుతూ సందడి చేస్తుంటారు. తమ చుట్టూ తాము రౌండ్‌గా తిరగడం అంటే పిల్లలకు చాలా ఇష్టం. అలాంటప్పుడు తాము వేసుకున్న గౌన్ ఎంత ఫ్లెయిర్ వస్తే అంత బాగుంటామనుకుంటారు
పేస్టల్ కలర్స్...
ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నవి పేస్టల్ కలర్స్. పిల్లలు కూడా ఆ రంగులను ప్లెజంట్‌గా భావిస్తారు. జర్దోసీ వర్క్స్ కొంతవరకు కావాలనుకుంటే చిన్న చిన్న పువ్వులు, కట్ బీడ్స్ వాడుకోవచ్చు. ఇవి పిల్లల చర్మానికి గుచ్చుకోవు. చూడ్డానికీ బాగుంటుంది.
►పిల్లలకు ఎంత తక్కువ యాక్ససరీస్ వాడితే అంత సౌకర్యంగా ఉంటారు.
►జుట్టుకు చిన్న బ్యాండ్, మెడలో పల్చగా ఉండే చిన్న చైన్, చేతికి సన్నని బ్రేస్‌లెట్ వేస్తే చాలు.
►పిల్లల చర్మానికి హాని కలిగించనవి ఏవైనా బాగుంటాయి.
►చెప్పులు హీల్స్ కాకుండా ప్లాట్‌గా ఉండే షూస్‌ను ఎంచుకుంటే సౌకర్యంగా ఉంటాయి.
►ఇలాంటి డ్రెస్సుల మీదకు ఏ ఇతర యాక్ససరీస్ కూడా అంతగా ఎలివేట్ అవ్వవు. అందుకని ఏ ఇతర హంగులూ అక్కర్లేదు.
నిహారిక ఫ్యాషన్ డిజైనర్,
శ్రీనగర్‌కాలనీ, హైదరాబాద్
instagram: Niharika Design Studio
Comments
Please login to add a commentAdd a comment