కాంతి మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు
-
బట్టలారేస్తుండగా విద్యుదాఘాతంతో వివాహిత మృతి
చండ్రుగొండ: ఉతికిన బట్టలు ఆరేస్తుండగా బైండింగ్ వైర్లతో కట్టిన దండేనికి విద్యుత్ ప్రసారమై ఓ మహిళ దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం పోకలగూడెం పంచాయతీ వెంకటియాతండాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..వెంకటియాతండాకు చెందిన ఇస్లావత్ కాంతి (25) శుక్రవారం సాయంత్రం దుస్తులను ఉతికి..ఇంటి దండెంపై ఆరేయబోయింది. ఇంటి విద్యుత్ సర్వీస్ వైరు తెగి..బైండింగ్ వైర్లతో ఉన్న దండేనికి కరెంట్ ప్రసారమైంది. ఇది గమనించని ఆమె దుస్తులను దీని మీద వేయగానే షాక్ కొట్టి అక్కడిక్కడే మరణించింది. మృతురాలికి భర్త చిన్న, పిల్లలు చరణ్, వరుణ్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏఎస్‌ఐ హుసేన్ వివరాలు సేకరించారు.