గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో మెప్పించింది. బీటౌన్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మారిపోయిన ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను 2018లో పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంటకు ఓ కూతురు కూడా పుట్టిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: నా ఇద్దరు కూతుర్లు ఇప్పటికీ నిత్యానంద దగ్గరే ఉన్నారు: నటుడు)
అయితే ఇటీవలే ముంబయిలో నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. బాలీవుడ్ దర్శకుడు తన లో దుస్తులను చూడాలనుకున్నారని వెల్లడించింది. 2002-03లో మధ్య కాలంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది.
ప్రియాంక మాట్లాడుతూ.. 'అప్పుడప్పుడే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. నేను ఒక సినిమాను అంగీకరించా. అందులో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దర్శకుడు నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు లో దుస్తులన్నీ తీసేయాలన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజే నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా. ఇందులో నాకు నటించడం ఇష్టం లేదు.' అంటూ ప్రియాంక చోప్రా గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. అయితే దీనిపై దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపింది.
(ఇది చదవండి: ఆ నిర్మాతకు అమ్మాయిల పిచ్చి.. ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడు: నటి)
Comments
Please login to add a commentAdd a comment