Philippines airport
-
రెండు రోజులుగా విమానాశ్రయంలోనే..
రణస్థలం: కరోనా ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీని విజృంభణకు విదేశాలకు వెళ్లిన భారతీయులంతా తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఉన్నత విద్య కోసం ఫిలిప్పీన్స్ వెళ్లిన 400 మంది విద్యార్థులు తిరిగి దేశానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరి దేశాలకు వారు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించడంతో ప్రయాణాలకు సిద్ధపడిన విద్యార్థులు విమాన సర్వీసులు రద్దయిపోవడంతో రెండు రోజులుగా మనీలా విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. రణస్థలం మండలం జేఆర్ పురానికి చెందిన జి.సాయినిఖిల్, లావేరు మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన ఎం.నరేష్ కూడా విమానాశ్రయంలోనే ఉండిపోయారు. కరోనా నేపథ్యంలో ఇక్కడ పడుతున్న ఇబ్బందులను ఇలా వివరించారు..(ఏపీలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు) ‘ఫిలిప్పీన్స్‌లో మన దేశానికి చెందిన 400 మంది విద్యార్థులం ఎంబీబీఎస్ చదువుతున్నాం. నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నాం. ఇందులో 85 మంది తెలుగు వారే. మూడు రోజుల కిందట ఫిలిప్పీన్స్ ప్రభుత్వం విదేశీయులంతా తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. దీంతో ఇండియా వచ్చేందుకు విమాన టికెట్లు తీసుకుని అంతా మనీలా ఎయిర్‌పోర్టుకు వచ్చాం. కానీ రెండు రోజులు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ విమానాశ్రయం మూసేస్తున్నట్లు ప్రకటించారు. విమాన సరీ్వసులు రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో మాకేమీ పాలు పోవడం లేదు. టికెట్ రూ. 30వేలు పెట్టి కొన్నాం. రిఫండ్ వస్తుందో రాదో తెలీడం లేదు. ఉండేందుకు వసతులు లేవు. తిరిగి రూములకు వెళ్లిపోదామంటే ఉండేందుకు డబ్బులు లేవు. ఇక్కడి ప్రభుత్వం మాకేమీ సహకరించడం లేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి రాక కోసం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. (తాత్కాలికంగా శ్రీవారి దర్శనం రద్దు) ప్రభుత్వమే రప్పించాలి విమాన టికెట్లు బుక్ చేసుకొని విమానాశ్రయానికి చేరుకుంటే విమానాలు రద్దు చేస్తున్నాం, విమానాశ్రయమే మూసేస్తున్నాం అని చెబితే చదువు కోసం వెళ్లిన విద్యార్థులు ఏం చేయగలరు..? భోజనాలు కూడా దొరకడం లేదంట. ప్రభుత్వమే వారిని రప్పించే ఏర్పాట్లు చేయాలి. – కల్యాణకుమార్ రాజా, విద్యార్థి నిఖిల్ తండ్రి ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మూడు రోజులు గడువిచ్చి స్వదేశాలకు వెళ్లిపొమ్మంది. ఈ లోగానే విమాన సరీ్వసులు రద్దయిపోయాయి. మనీలా విమానాశ్రయం మూసేస్తున్నారని మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు. కరోనా వల్ల వారు ఏం ఇబ్బందులు పడుతున్నారో..? ప్రభుత్వం చొరవ తీసుకుని వారిని రప్పించాలి.– ఎం.గోవిందరావు, విద్యార్థి నరేష్ తండ్రి -
బట్టలు ఫుల్.. బిల్లు నిల్..
విమానంలో వెంట తీసుకెళ్లే బ్యాగేజీ.. పరిమితికి మించి బరువుందని, అందుకు అదనపు రుసుము చెల్లించాలని ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో.. ఫొటోలో భలేగా పోజిస్తున్న ఈ అమ్మాయికి వెంటనే ఓ ఐడియా తళుక్కున మెరిసింది. వెంటనే బరువుగా ఉన్న లగేజీ బ్యాగ్‌ను తెరచి అందులో ఉన్న తన డ్రెస్‌లు అన్నింటినీ ఒకదానిపై మరోటి తొడుక్కుంది. ఇలా దాదాపు మూడు కేజీల బరువున్న డ్రెస్‌లను అదనంగా వేసుకుంది. ఎయిర్పోర్ట్ అధికారులకు కట్టాల్సిన ‘అదనపు బరువు బిల్లు’ను తప్పించుకుంది. ఫిలిప్పీన్స్ దేశంలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందీ ఘటన. -
ఐపీవోకి జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాభాల్లో ఉన్న ఎయిర్పోర్ట్ వ్యాపారాన్ని విభజించి పబ్లిక్ ఇష్యూ జారీ చేసే యోచనలో జీఎంఆర్ ఇన్ఫ్రా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడం ద్వారా కనీసం రూ.2,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ పబ్లిక్ ఇష్యూ బాధ్యతను సిటీగ్రూపు, జేపీమోర్గాన్, యాక్సిస్ క్యాపిటల్, ఐడీఎఫ్సీలకు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై జీఎంఆర్ అధికారులను సంప్రదించగా, ఇవి పూర్తిగా ఊహాగానాలని, ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జీఎంఆర్ ఇన్ఫ్రా దేశంలో న్యూఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులతో పాటు, టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టును నిర్వహిస్తోంది. జీఎంఆర్ ఇన్‌ఫ్రాకి చెందిన విద్యుత్, ఇన్ఫ్రా వంటి అన్ని విభాగాలు భారీ నష్టాలను అందిస్తే ఎయిర్‌పోర్టు వ్యాపారం లాభాలను కురిపించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్టు విభాగం రూ. 125 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆదాయం కూడా రూ.2,792 కోట్ల నుంచి రూ.2,870 కోట్లకు పెరిగింది. జీఎంఆర్ చేతికి ఫిలిప్పీన్స్ ఎయిర్పోర్ట్ రూ.2,500 కోట్ల పెట్టుబడి అంచనాతో అభివృద్ధి చేయనున్న ఫిలిప్పీన్స్‌లోని మక్టన్- సెబు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు బిడ్డింగ్‌లో తమ కన్సార్టియం అగ్రస్థానంలో నిలిచినట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా ఒక ప్రకటనలో తెలిపింది. మెగావైడ్ కార్పొరేషన్‌తో కలిసి ఈ బిడ్డింగ్‌లో పాల్గొన్నామని, గురువారం బిడ్డింగ్‌లు తెరిచి చూడగా తాము మొదటి స్థానంలో నిలిచినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. కాని ఈ సమాచారం ఇంకా అధికారికంగా అందాల్సి ఉందన్నారు. -
ప్రపంచంలోనే అతి చెత్త విమానాశ్రయం ఫిలిప్పీన్స్దే!
మనీలా: ప్రపంచంలోనే అతి చెత్త విమానాశ్రయం ఏదీ? అంటే ఫిలిప్పీన్స్ విమానాశ్రయమేనంటోంది ఓ ట్రావెల్ వెబ్సైట్ సర్వే! ఈ సైట్ నిర్వహించిన సర్వేలో వరుసగా రెండో ఏడాది ఫిలిప్పీన్స్ ఈ ‘అతి చెత్త’ స్థానంలో నిలిచింది. అయితే దేశాధికారులు మాత్రం ఆ వెబ్సైట్ ఫలితాలను తోసిపుచ్చుతున్నారు. విమానాశ్రయంలో తాము సౌకర్యాలను బాగానే మెరుగుపరిచామని అంటున్నారు. ‘ద గైడ్ టు స్లీపింగ్ ఇన్ ఎయిర్‌పోర్ట్స్’ వెబ్సైట్.. ఈ సర్వే చేసింది. సౌకర్యం, శుభ్రత, వినియోగదారునికి సేవలు, ఇతర ఏర్పాట్లపై ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు ఫిలిప్పీన్స్‌పై ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఇక్కడి సౌకర్యాలు శిథిలావస్థలో ఉన్నాయని, విమానాశ్రయ సిబ్బంది ప్రత్యేకించి ట్యాక్సీ డ్రైవర్లు.. ప్రయాణికులకు గౌరవమే ఇవ్వరని, ఇక్కడ వెయిటింగ్ సమయం చాలా ఎక్కువని, అధికారులు కూడా చాలా మూర్ఖంగా ఉంటారని ప్రయాణికులు వెబ్సైట్లో అభిప్రాయపడ్డారు.