బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చాట్ బండ్లు.. ఎక్కడ చూసినా ఎక్కువ శాతం టీనేజర్లే కనిపిస్తూ ఉంటారు. అంతకంటే చిన్న పిల్లలకు స్వయంగా తల్లిదండ్రులే మురిపెంగా తీసుకువెళ్లి తినిపిస్తుంటారు. అయితే బర్గర్లు, పిజ్జాలు, చాట్‌లు, మిల్క్‌షేక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటివి తినటం వల్ల శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరుతుంటాయి. వాటిని కరిగించటానికి సరిపడా వ్యాయామం లేక పిల్లలు ఊబకాయుల్లా తయారవుతున్నారు.
జంక్‌ఫుడ్‌కు అలవాటు పడకుండా ఉండాలంటే ఇంట్లోనే కొత్తరుచుల్లో స్నాక్స్ తయారు చేయటం నేర్చుకోవాలి. తక్కువ నూనె, తీపి, మసాలాలతో రుచికరమైన స్నాక్స్ చేసి పెడితే ఫాస్ట్ ఫుడ్స్‌కు పిల్లలు ఆకర్షితులవకుండా ఉంటారు. ఏ అలాగే ఆహారంలో తగినంత పీచు పదార్థం ఉండేలా చూసుకుంటే ప్రొటీన్ ఫుడ్ వల్ల మలబద్ధకం తలెత్తకుండా ఉంటుంది.
ఏ అల్పాహారంలో బ్రెడ్, శాండ్‌విచ్‌లకు బదులు గోధుమ రవ్వతో చేసిన ఉప్మా, పెసలతో చేసిన పొంగల్, పెసరట్టు, రాగి, క్యారట్ ఇడ్లీ లాంటివి ఇవ్వాలి. ఏ బాదం, పిస్తా, వాల్‌నట్స్, ఉడకబెట్టిన సెనగలు, మొలకలు అందుబాటులో ఉంచాలి. ఏ ఫ్రిజ్ ట్రేలలో చాక్లెట్లు, బిస్కెట్లకు బదులు తాజా పండ్లు, సలాడ్లు, పాలు, గుడ్లు, పళ్లరసాలు, చెరుకు రసం, టమాటా రసం లాంటివి ఉండాలి. ఏ పిల్లలు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినేలా చూసుకోవాలి. ఏ ఉడికించిన సెనగలు, బొబ్బర్లు ఎక్కువ సమయంపాటు శక్తినిస్తాయి కాబట్టి ఔట్ డోర్ గేమ్స్ ఆడే పిల్లలకు వీటిని శ్నాక్స్‌గా ఇస్తూ ఉండాలి.
జంక్ ఫుడ్ నుంచి రక్షించుకోవాలంటే..?
పెద్ద వాళ్ళు జంక్ ఫుడ్స్ తింటూ, కాఫీలు, టీలు తాగేస్తుంటే వారిని చూస్తూ పెరిగే పిల్లలు అదే అలవాటు చేసుకుంటారు. అందువల్ల అలాంటి వాటిని ముందు పెద్దలు మానేయాలి. పెద్దవాళ్ళు పండ్లు, డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటే పిల్లలు కూడా అవే తింటారు. నిమ్మరసం, క్యారెట్ రసం, బీట్రూట్ రసం రోజూ తీసుకోండి. పిల్లలు కూడా అవే ఇష్టపడతారు.
(చదవండి: డయాబెటిస్ పేషెంట్స్‌కి ఈ వ్యాధుల ఎటాక్ అయితే..డేంజర్‌లో ఉన్నారని అర్థం!)
Comments
Please login to add a commentAdd a comment