ఐ-టీ ఉద్యోగులకు సీబీడీటీ తాజా ఆదేశాలు | Avoid important official discussions on social media: CBDT tells I-T staff | Sakshi
Sakshi News home page

ఐ-టీ ఉద్యోగులకు సీబీడీటీ తాజా ఆదేశాలు

Published Sat, Dec 24 2016 7:59 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

ఐ-టీ ఉద్యోగులకు  సీబీడీటీ తాజా ఆదేశాలు - Sakshi

ఐ-టీ ఉద్యోగులకు సీబీడీటీ తాజా ఆదేశాలు

న్యూఢిల్లీ: సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ)  ఆదాయ పన్ను శాఖ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.   అధికారిక నిర్ణయాలను ట్విట్టర్, ఫేస్బుక్ ,వాట్సాప్ లాంటి  ఇతర సామాజిక మీడియా వేదికల్లో   చర్చించ వద్దంటూ ఆదాయం పన్ను శాఖ అధికారులను  తాజాగా  సీబీడీటీ  ఆదేశించింది.  దీనికి సంబంధించిన మార్గదర్శకాలను  అన్ని ప్రాంతీయ కార్యాలయాల  ముఖ్య అధికారులకుజారీ చేసింది. సోషల్ మీడియా వేదికలపై  కొన్నికీలక సమావేశాలు మినిట్స్ సహా అధికారిక నిర్ణయాలు చర్చకురావడంపై  స్పందించిన సంస్థ   ఈ ఆదేశాలిచ్చింది.   
ఆదాయ పన్ను శాఖకు సంబంధించి కొన్నిముఖ్యమైన నిర్ణయాలను తరచుగా సోషల్ మీడియాలో చర్చకువస్తున్న విషయాన్ని గమనించిన శాఖ ఈ ఆదేశాలను  జారిచేసింది.  సంబంధిత అధికారులు తప్ప,   ఇలాంటి చర్చలను ఇతర ఉద్యోగులు  అనధికారిక చర్చలను,   ప్రచారాన్ని నిరోధించాలని కోరింది.  ఈ మేరకుఇలాంటి చర్చల్ని తప్పనిసరిగా నివారించాలంటూ ఇటీవల సీబీడీటీ సుశీల్  చంద్ర  ప్రాంతీయ అధికారులకు   సూచిస్తూ ఒకలేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమాలు, 1964 రూల్ 11 ను సూచిస్తూ తాజా నోటీసులు జారీ చేసింది. ఇకముందుఎలాంటి  సమాచారాన్ని చర్చించడానికి వీల్లేదని ఉద్యోగులకు మరోసారి స్పష్టం చేసింది.
కాగా ప్రజలకు అధికారిక సమాచారం జారీ కోసం ఆదాయ పన్ను  శాఖ మైక్రో బ్లాగింగ్ సైట్ 'Twitter-- '@IncomeTaxIndia'   పేరుతో ఒక అధికారిక అకౌంట్ ను కలిగి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement