రొమ్ము క్యాన్సర్‌ను జయిద్దాం..
కేఎల్ వర్సిటీ మహిళా సంఘ కన్వీనర్ డాక్టర్ లలిత
గుంటూరు ఈస్ట్: రొమ్ము క్యాన్సర్‌పై అందరూ అవగాహన కలిగి ఉండాలని కేఎల్ యూనివర్సిటీ మహిళా సంఘ కన్వీనర్ డాక్టర్ లలిత పేర్కొన్నారు. శంకర్ విలాస్ సెంటర్‌లో కేఎల్ యూనివర్సిటీ మహిళా ఫోరం, బయో టెక్నాలజీ, బీఫార్మసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్‌పై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆమె మాట్లాడారు. మహిళలు ప్లకార్డులు, పింక్ రిబ్బన్లు, బెలూన్‌లు పట్టుకుని నినాదాలు చేశారు. ఉన్నత విద్య అభ్యసించిన వారు కూడా క్యాన్సర్ గురించి తెలుసుకునేందుకు సిగ్గు పడుతున్నారనీ, ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసన్న, బయో టెక్నాలజీ విభాగం కన్వీనర్ హిమత, మహిళా ఫోరం కో–కన్వీనర్ శ్రీదేవి పాల్గొన్నారు.