
గుర్తు తెలియని కొందరు దుండగులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేతపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నాయకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పశ్చబెంగాల్‌లో పుర్బా బర్ధమాన్‌లోని శక్తిగఢ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ చెందిన వ్యాపారవేత్త,బీజేపీ నేత రాజు ఝూ, తన సహచరులతో కలిసి కోల్‌కతాకు వెళ్తుండగా.. శక్తిగఢ్‌లోని దుకాణం వెలుపల కొందరూ దుండగులు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు.
ఈ ఘటన తదనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు ఝూని హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనలో ఝూ సహచరులు కూడా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసుల తెలిపారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, బీజేపీ నాయకుడు ఝూపై అక్రమ బొగ్గు వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తృణమూల్ ప్రభుత్వ హయాంలో కూడా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఆయన 2021 డిసెంబర్‌లో జరిగిన చివరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో ఆయన బీజేపీలోకి చేరారు.