అనుకోకుండా బుల్లెట్ల వైపు వెళ్లాడు | Ambulance driver injured in firing by security forces | Sakshi
Sakshi News home page

అనుకోకుండా బుల్లెట్ల వైపు వెళ్లాడు

Published Fri, Aug 19 2016 8:36 AM | Last Updated on Sat, Aug 18 2018 2:18 PM

అనుకోకుండా బుల్లెట్ల వైపు వెళ్లాడు - Sakshi

అనుకోకుండా బుల్లెట్ల వైపు వెళ్లాడు

శ్రీనగర్: బలగాల కాల్పుల్లో అనుకోకుండా ఓ అంబులెన్స్ డ్రైవర్ గాయపడ్డాడు. ఫైరింగ్ జరుగుతున్న ప్రాంతంవైపు నుంచే ఓ రోగిని తన అంబులెన్స్లో తీసుకెళుతున్న అతడికి ప్రమాదవశాత్తు బుల్లెట్ తగలడంతో గాయాలయ్యాయి. బుల్లెట్ గాయంతోనే అతడు డ్రైవ్ చేస్తూ ఆస్పత్రికి వెళ్లాడు. జమ్మూకశ్మీర్లో ఆందోళనలు అదుపుచేసే క్రమంలో బలగాలు అప్పుడప్పుడు బాష్పవాయుగోళాలతోపాటు పెల్లెట్ గన్స్ను, ఇతర తుపాకులను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సమయంలోనే గందీర్ బాల్ జిల్లా నుంచి ఓ పేషెంట్ ను ఎక్కించుకొని గులాం అహ్మద్ సోఫీ అనే డ్రైవర్ తాను పనిచేస్తున్న ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రికి వస్తుండగా శ్రీనగర్ లోని సఫాకదల్ ప్రాంతంలో బలగాలు తుపాకులు పేల్చారు. అందులోని ఒక బుల్లెట్ అతడి చేతిలోకి దూసుకెళ్లింది. అయినప్పటికీ అతడు అంబులెన్స్ నడుపుకుంటూ వెళ్లి ఆస్పత్రిలో చేరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement