security forces in Srinagar
-
హిజ్బుల్ టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: కశ్మీర్ లోయలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన అత్యంత సీనియర్ కమాండర్ అల్తాఫ్ అహ్మద్ దార్‌తో పాటు మరో మిలిటెంట్‌ను బుధవారం అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కొద్ది గంటల తరువాత షోపియాన్ జిల్లాలో పేట్రేగిపోయిన మిలిటెంట్లు పోలీసు బృందంపై అనూహ్య దాడికి పాల్పడి నలుగురిని బలిగొన్నారు. మృతిచెందిన పోలీసులను ఇష్పాక్ అహ్మద్ మీర్, జువైద్ అహ్మద్ భట్, మహ్మద్ ఇక్బాల్ మీర్, ఆదిల్ మంజూర్ భట్ గా గుర్తించారు. అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే మిలిటెంట్లు పోలీసులను ల క్ష్యంగా చేసుకుని దాడిచేశారని భావిస్తున్నారు. ముందు ఎన్కౌంటర్..తరువాత ఉగ్రదాyì తెల్లవారుజామునభారీ ఎన్‌కౌంటర్‌తో అనంత్‌నాగ్ దద్దరిల్లింది. ఈ ఎన్కౌంటర్లో హిజ్బుల్ టాప్ కమాండర్ అల్తాఫ్ అహ్మద్ దార్‌తో పాటు మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. కశ్మీర్లో లోయలో పోలీసులు లక్ష్యంగా జరిగిన చాలా దాడుల్లో దార్ ప్రధాన నిందితుడు. దార్ సంచరిస్తున్నాడన్న సమాచారంతో మునివార్డ్ గ్రామం లో పోలీసులు, పారామిలిటరీ బృందాలు సోదాలు ముమ్మరం చేశారు. ‘సోదాల సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ టంతో పోలీసులు అంతే దీటుగా స్పం దించారు. కాల్పుల్లో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులు అల్తాఫ్ అహ్మద్ దార్ అలియాస్ అతాఫ్ కచ్రూ, ఒమర్ రషీద్ వనీ హతమయ్యారు. కుల్గాంకు చెందిన అల్తాఫ్ 2007 నుంచి హిజ్బుల్ కోసం పనిచేస్తూ ఎన్నో దాడుల్లో పాలుపంచుకున్నాడు. 2016లో బుర్హాన్ వనీ హత్య తరువాత లోయలో అశాంతిని రాజేయడంలో కీలక పాత్ర పోషించాడు. -
అమర్నాథ్ యాత్రపై ఉగ్ర నీడలకు చెక్
సాక్షి, శ్రీనగర్ : ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు భద్రతా దళాలు అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖల వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. అమర్నాథ్ యాత్ర కోసం బల్టాల్, పహల్గాం రూట్లలో పెద్ద ఎత్తున భద్రతా దళాలను మోహరించామని, శాంతిభద్రతల పర్యవేక్షణ, కౌంటర్ ఇంటెలిజెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని జమ్ము కశ్మీర్ జోన్ సీఆర్పీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ వీఎస్కే కౌముది తెలిపారు. కాగా, జమ్ము కశ్మీర్లో గవర్నర్ పాలన విధించిన మరుసటి రోజు భద్రతా దళాలు ఈ చర్యను చేపట్టాయి. మరోవైపు గవర్నర్ వోహ్రా ఉగ్ర కార్యకలాపాలను దీటుగా ఎదర్కోవడంలో పేరొందిన మాజీ పోలీస్ బాస్ విజయ్ కుమార్‌ను తన సలహాదారుగా ఎంపిక చేసుకోవడం గమనార్హం. కశ్మీర్లో పాలక బీజేపీ-పీడీపీ సర్కార్ కుప్పకూలిన కొద్ది గంటల్లోనే రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. రంజాన్ సందర్భంగా నిలిపివేసిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను గత వారం పునరుద్ధరించారు. -
అనుకోకుండా బుల్లెట్ల వైపు వెళ్లాడు
శ్రీనగర్: బలగాల కాల్పుల్లో అనుకోకుండా ఓ అంబులెన్స్ డ్రైవర్ గాయపడ్డాడు. ఫైరింగ్ జరుగుతున్న ప్రాంతంవైపు నుంచే ఓ రోగిని తన అంబులెన్స్‌లో తీసుకెళుతున్న అతడికి ప్రమాదవశాత్తు బుల్లెట్ తగలడంతో గాయాలయ్యాయి. బుల్లెట్ గాయంతోనే అతడు డ్రైవ్ చేస్తూ ఆస్పత్రికి వెళ్లాడు. జమ్మూకశ్మీర్‌లో ఆందోళనలు అదుపుచేసే క్రమంలో బలగాలు అప్పుడప్పుడు బాష్పవాయుగోళాలతోపాటు పెల్లెట్ గన్స్‌ను, ఇతర తుపాకులను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే గందీర్ బాల్ జిల్లా నుంచి ఓ పేషెంట్ ను ఎక్కించుకొని గులాం అహ్మద్ సోఫీ అనే డ్రైవర్ తాను పనిచేస్తున్న ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రికి వస్తుండగా శ్రీనగర్ లోని సఫాకదల్ ప్రాంతంలో బలగాలు తుపాకులు పేల్చారు. అందులోని ఒక బుల్లెట్ అతడి చేతిలోకి దూసుకెళ్లింది. అయినప్పటికీ అతడు అంబులెన్స్ నడుపుకుంటూ వెళ్లి ఆస్పత్రిలో చేరాడు.