హకూరా గ్రామంలో అల్తాఫ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు
శ్రీనగర్: కశ్మీర్ లోయలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన అత్యంత సీనియర్ కమాండర్ అల్తాఫ్ అహ్మద్ దార్‌తో పాటు మరో మిలిటెంట్‌ను బుధవారం అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కొద్ది గంటల తరువాత షోపియాన్ జిల్లాలో పేట్రేగిపోయిన మిలిటెంట్లు పోలీసు బృందంపై అనూహ్య దాడికి పాల్పడి నలుగురిని బలిగొన్నారు. మృతిచెందిన పోలీసులను ఇష్పాక్ అహ్మద్ మీర్, జువైద్ అహ్మద్ భట్, మహ్మద్ ఇక్బాల్ మీర్, ఆదిల్ మంజూర్ భట్ గా గుర్తించారు. అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే మిలిటెంట్లు పోలీసులను ల క్ష్యంగా చేసుకుని దాడిచేశారని భావిస్తున్నారు.
ముందు ఎన్‌కౌంటర్..తరువాత ఉగ్రదాyì
తెల్లవారుజామునభారీ ఎన్‌కౌంటర్‌తో అనంత్‌నాగ్ దద్దరిల్లింది. ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ టాప్ కమాండర్ అల్తాఫ్ అహ్మద్ దార్‌తో పాటు మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. కశ్మీర్‌లో లోయలో పోలీసులు లక్ష్యంగా జరిగిన చాలా దాడుల్లో దార్ ప్రధాన నిందితుడు. దార్ సంచరిస్తున్నాడన్న సమాచారంతో మునివార్డ్ గ్రామం లో పోలీసులు, పారామిలిటరీ బృందాలు సోదాలు ముమ్మరం చేశారు. ‘సోదాల సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ టంతో పోలీసులు అంతే దీటుగా స్పం దించారు. కాల్పుల్లో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులు అల్తాఫ్ అహ్మద్ దార్ అలియాస్ అతాఫ్ కచ్రూ, ఒమర్ రషీద్ వనీ హతమయ్యారు. కుల్గాంకు చెందిన అల్తాఫ్ 2007 నుంచి హిజ్బుల్ కోసం పనిచేస్తూ ఎన్నో దాడుల్లో పాలుపంచుకున్నాడు. 2016లో బుర్హాన్ వనీ హత్య తరువాత లోయలో అశాంతిని రాజేయడంలో కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment