hizbul mojahiddin
-
హిజ్బుల్ టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: కశ్మీర్ లోయలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన అత్యంత సీనియర్ కమాండర్ అల్తాఫ్ అహ్మద్ దార్‌తో పాటు మరో మిలిటెంట్‌ను బుధవారం అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కొద్ది గంటల తరువాత షోపియాన్ జిల్లాలో పేట్రేగిపోయిన మిలిటెంట్లు పోలీసు బృందంపై అనూహ్య దాడికి పాల్పడి నలుగురిని బలిగొన్నారు. మృతిచెందిన పోలీసులను ఇష్పాక్ అహ్మద్ మీర్, జువైద్ అహ్మద్ భట్, మహ్మద్ ఇక్బాల్ మీర్, ఆదిల్ మంజూర్ భట్ గా గుర్తించారు. అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే మిలిటెంట్లు పోలీసులను ల క్ష్యంగా చేసుకుని దాడిచేశారని భావిస్తున్నారు. ముందు ఎన్కౌంటర్..తరువాత ఉగ్రదాyì తెల్లవారుజామునభారీ ఎన్‌కౌంటర్‌తో అనంత్‌నాగ్ దద్దరిల్లింది. ఈ ఎన్కౌంటర్లో హిజ్బుల్ టాప్ కమాండర్ అల్తాఫ్ అహ్మద్ దార్‌తో పాటు మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. కశ్మీర్లో లోయలో పోలీసులు లక్ష్యంగా జరిగిన చాలా దాడుల్లో దార్ ప్రధాన నిందితుడు. దార్ సంచరిస్తున్నాడన్న సమాచారంతో మునివార్డ్ గ్రామం లో పోలీసులు, పారామిలిటరీ బృందాలు సోదాలు ముమ్మరం చేశారు. ‘సోదాల సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ టంతో పోలీసులు అంతే దీటుగా స్పం దించారు. కాల్పుల్లో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులు అల్తాఫ్ అహ్మద్ దార్ అలియాస్ అతాఫ్ కచ్రూ, ఒమర్ రషీద్ వనీ హతమయ్యారు. కుల్గాంకు చెందిన అల్తాఫ్ 2007 నుంచి హిజ్బుల్ కోసం పనిచేస్తూ ఎన్నో దాడుల్లో పాలుపంచుకున్నాడు. 2016లో బుర్హాన్ వనీ హత్య తరువాత లోయలో అశాంతిని రాజేయడంలో కీలక పాత్ర పోషించాడు. -
ఉగ్రవాదంలోకి రాజకీయ నేత కొడుకు
శ్రీనగర్: కశ్మీర్‌లోని తెహ్రీక్–ఎ–హురియత్ అనే రాజకీయ పార్టీ చైర్మన్ కొడుకు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. పార్టీ చైర్మన్‌గా అష్రఫ్ శెరాయ్ ఇటీవలే ఎన్నికయ్యారు. 26 ఏళ్ల వయసున్న ఆయన కొడుకు జునైద్ శుక్రవారం అదృశ్యమయ్యాడు. దీనిపై అష్రఫ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఏకే–47 తుపాకీ పట్టుకుని ఆయుధాలు ధరించిన జునైద్ ఫొటో శనివారం సోషల్‌మీడియాలో కనిపించింది. -
'ఇస్లాం కోసం రాళ్లు రువ్వండి'
శ్రీనగర్: ఇస్లాం కోసం కశ్మీరీ యువత పోలీసులు, బలగాలపై రాళ్లు రువ్వాలంటూ హిజ్బుల్ మొజాహిద్దీన్ మిలిటెంట్ జకీర్ రషీద్ భట్ పిలుపునిచ్చాడు. గత ఏడాది హిజ్బుల్ మిలిటెంట్ బుర్హాన్ వానీని బలగాలు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. బుర్హాన్ స్ధానంలోకి వచ్చిన రషీద్.. కశ్మీరీల నేషనిలిజం కోసం మిలిటెంట్ల ఉద్యమం ప్రారంభమైందనే వ్యాఖ్యలను కొట్టిపడేశాడు. సెక్యులారిటీ, ఫ్రీడమ్ లాంటి పదాలకు మిలిటెన్సీలో చోటే లేదని హురియత్ కశ్మీర్ యువతలో అలాంటి భ్రమలు కలిగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన రషీద్ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. మొత్తం 12 నిమిషాల పాటు మాట్లాడిన రషీద్.. ఇస్లాం పేరిట దాడులు చేయాలని అన్నాడు. కశ్మీర్లో త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకుండా బహిష్కరించాలని కోరాడు. రాళ్లు ఒకరికోసం రువ్వుతున్నట్లు భావించకుండా ఇస్లాం కోసం చేస్తున్నట్లు భావించాలని అన్నాడు. ఏదో ఒక రోజు కశ్మీర్ వ్యాలీలో ఇస్లాం జెండా రెపరెపలాడుతుందని వ్యాఖ్యానించాడు.