Altaf Ahmad
-
హిజ్బుల్ టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: కశ్మీర్ లోయలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన అత్యంత సీనియర్ కమాండర్ అల్తాఫ్ అహ్మద్ దార్‌తో పాటు మరో మిలిటెంట్‌ను బుధవారం అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కొద్ది గంటల తరువాత షోపియాన్ జిల్లాలో పేట్రేగిపోయిన మిలిటెంట్లు పోలీసు బృందంపై అనూహ్య దాడికి పాల్పడి నలుగురిని బలిగొన్నారు. మృతిచెందిన పోలీసులను ఇష్పాక్ అహ్మద్ మీర్, జువైద్ అహ్మద్ భట్, మహ్మద్ ఇక్బాల్ మీర్, ఆదిల్ మంజూర్ భట్ గా గుర్తించారు. అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే మిలిటెంట్లు పోలీసులను ల క్ష్యంగా చేసుకుని దాడిచేశారని భావిస్తున్నారు. ముందు ఎన్కౌంటర్..తరువాత ఉగ్రదాyì తెల్లవారుజామునభారీ ఎన్‌కౌంటర్‌తో అనంత్‌నాగ్ దద్దరిల్లింది. ఈ ఎన్కౌంటర్లో హిజ్బుల్ టాప్ కమాండర్ అల్తాఫ్ అహ్మద్ దార్‌తో పాటు మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు కాల్చి చంపాయి. కశ్మీర్లో లోయలో పోలీసులు లక్ష్యంగా జరిగిన చాలా దాడుల్లో దార్ ప్రధాన నిందితుడు. దార్ సంచరిస్తున్నాడన్న సమాచారంతో మునివార్డ్ గ్రామం లో పోలీసులు, పారామిలిటరీ బృందాలు సోదాలు ముమ్మరం చేశారు. ‘సోదాల సందర్భంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ టంతో పోలీసులు అంతే దీటుగా స్పం దించారు. కాల్పుల్లో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులు అల్తాఫ్ అహ్మద్ దార్ అలియాస్ అతాఫ్ కచ్రూ, ఒమర్ రషీద్ వనీ హతమయ్యారు. కుల్గాంకు చెందిన అల్తాఫ్ 2007 నుంచి హిజ్బుల్ కోసం పనిచేస్తూ ఎన్నో దాడుల్లో పాలుపంచుకున్నాడు. 2016లో బుర్హాన్ వనీ హత్య తరువాత లోయలో అశాంతిని రాజేయడంలో కీలక పాత్ర పోషించాడు. -
కీలక ఉగ్రవాది కోసం వెళ్లి నేలకొరిగాడు
శ్రీనగర్: ఉగ్రవాదుల ఎత్తులకు పై ఎత్తులకు వేసి వారి ఆటకట్టించగల జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. కశ్మీర్‌లోని బందిపోర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో అల్తాఫ్ అహ్మద్ అనే సబ్ ఇన్స్పెక్టర్ నేలకొరిగాడు. ఈ విషయం తెలిసి రాష్ట్ర పోలీసు శాఖ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. ఎందుకంటే చనిపోయిన అల్తాఫ్‌కు కర్తవ్యం అంటే ప్రాణం. ఎంతటి క్లిష్ల పరిస్థితులమధ్యనైనా విధులు నిర్వర్తించడంలో ముందుంటాడు. అలాంటి అధికారి ఉగ్రవాదులతో జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో పోలీసుశాఖకు తీరని లోటు ఏర్పడినట్లయింది. 'నేను మీ కెమెరా ముందు ఏం మాట్లాడలేకపోతున్నాను. బహుషా నాకు ఏడ్పుకూడా రావొచ్చు' అని అక్కడి డీజీపీ కే రాజేంద్ర కుమార్ అన్నారు. మరో ఇద్దరు సహోద్యోగులతో కలిసి అల్తాఫ్ బందిపూర్కు కోవర్ట్ మిషన్ లో భాగంగా వెళ్లాడని, అక్కడ పాకిస్థాన్ ఉగ్రవాది లష్కరే తోయిబా కమాండర్ అబూ ఖాసింను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రయత్నించాడని, ఆ ప్రయత్నంలో జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 5న ఉదంపూర్ వద్ద బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై భారీ ఎత్తున దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈదాడి ప్రధాన సూత్రదారుడు ఖాసీం అని గుర్తించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక విధుల్లో భాగంగా బందిపోర్ జిల్లాకు అల్తాఫ్‌ను పంపించారు. కానీ, టార్గెట్‌కు దగ్గరవుతుండగానే వాళ్లు ఎదురుకాల్పులు జరపగా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కన్నుమూశాడు. ఇప్పటి వరకు సైన్యం నిర్వహించిన పలు ఆపరేషన్లకు ఆల్తాఫ్ ఎనలేని సేవలను అందించాడు.