బిహార్ లో కాల్పులు.. జవాన్ మృతి | One RPF jawan shot dead, another injured in a train in Bihar; INSAS rifles looted | Sakshi
Sakshi News home page

బిహార్ లో కాల్పులు.. జవాన్ మృతి

Published Sat, May 14 2016 10:53 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

బిహార్ లో కాల్పులు.. జవాన్ మృతి

బిహార్ లో కాల్పులు.. జవాన్ మృతి

పాట్నా: బీహార్ లోమరోసారి తుపాకీ మోత మోగింది. వారణాసి-బక్సర్ మధ్య నడిచే పాసింజర్ రైల్లో దుండగులు దోపిడీకి యత్నించారు. అయితే వారి ప్రయత్నాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) జవాన్లు అడ్డుకోవటంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాను మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జవాన్ల వద్ద ఉన్న రైఫిల్స్ ను తీసుకుని పరారయ్యారు.

గాయపడినవారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం వారణాసిలోని ఆస్పత్రికి తరలించగా ఓ  జవాన్ మృతి చెందాడు. మృతుడు  అభిషేక్ సింగ్ గా గుర్తించారు. గాయపడిన మరో జవాను  నంద్ లాల్ యాదవ్  పరిస్థితి విషమంగా ఉంది. అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం వారణాసికి తరలించారు. మరోవైపు  రైల్వే సూపరింటిండెంట్ జితేంద్ర  మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement