RPF jawan
-
రైల్లో ఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్య
సాక్షి, వైఎస్సార్ కడప: విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన కలకలం రేపుతోంది. ముంబై నుంచి చెన్నై వెళుతున్న మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో విధులు నిర్వహిస్తున్న ఆర్.ఎస్.పన్వర్ గురువారం అర్ధరాత్రి తుపాకీతో కాల్చుకుని మృతి చెందాడు. నందలూరు రైల్వే స్టేషన్లో అతన్ని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కడప నుంచి ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ దాటాక ఈ ఘటన జరిగినట్లుగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చదవండి: సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్లతో ఉగ్రదాడి గర్భిణీని 6 కి.మీ. మోసిన జవాన్లు -
ఆర్పీఫ్ హెడ్ కానిస్టేబుల్ కాత్తితో వీరంగం
-
జవాను సాహసం.. ప్రాణాలతో బయటపడ్డ మహిళ
ముంబై : ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్) జవాను ప్రాణాలకు తెగించి రైలు ప్రమాదం నుంచి ఓ మహిళను కాపాడారు. ఈ సంఘటన ముంబైలోని కంజుర్మార్గ్ రైల్వే స్టేషన్లో మంగళవారం చోటుచేసుకుంది. గమ్యస్థానం రావడంతో రైలు నుంచి కిందకు దిగే సమయంలో ఓ మహిళ చీర బోగీ డోర్లో ఇరుక్కుపోయింది. అదే సమయంలో రైలు కదలడంతో మహిళ కిందపడిపోయింది. రైలు వేగం నిధానంగా పెరగడంతో చీరతో పాటూ మహిళ ఈడ్చుకుంటూ ముందుకు పోయింది. ఇది గమనించిన వెనక బోగిలో ఉన్న జవాను వెంటనే కిందకు దిగి పరిగెత్తి మహిళను రైలుకు దూరంగా లాగారు. ఈ క్రమంలో జవాను కూడా కిందపడిపోయారు. జవాను సమయస్పూర్తితో వ్యవహరించడంతో మహిళ రైలుకు, ఫ్లాట్ ఫామ్‌కు మధ్య పడకుండా ప్రాణాలతో బయటపడింది. బాధితురాలిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రాణాలకు సైతం తెగించి మహిళను కాపాడిన జవానును నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీకెమెరాలో రికార్డయిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. -
చాక చక్యంతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన జవాన్
-
బిహార్ లో కాల్పులు.. జవాన్ మృతి
పాట్నా: బీహార్ లోమరోసారి తుపాకీ మోత మోగింది. వారణాసి-బక్సర్ మధ్య నడిచే పాసింజర్ రైల్లో దుండగులు దోపిడీకి యత్నించారు. అయితే వారి ప్రయత్నాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) జవాన్లు అడ్డుకోవటంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాను మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జవాన్ల వద్ద ఉన్న రైఫిల్స్ ను తీసుకుని పరారయ్యారు. గాయపడినవారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం వారణాసిలోని ఆస్పత్రికి తరలించగా ఓ జవాన్ మృతి చెందాడు. మృతుడు అభిషేక్ సింగ్ గా గుర్తించారు. గాయపడిన మరో జవాను నంద్ లాల్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉంది. అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం వారణాసికి తరలించారు. మరోవైపు రైల్వే సూపరింటిండెంట్ జితేంద్ర మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. -
కిక్‌లతో తెలుగు జవాన్ గిన్నిస్ రికార్డు
హైదరాబాద్: కొరియన్ ఆత్మరక్షణ విద్య టైక్వాండోలో తెలుగు తేజం, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జవాన్ ఎ. మధుసూదన్ రావు గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఒక గంటలో 56, 148 ఫుల్ కాంటాక్ట్ కిక్స్ కొట్టడంద్వారా ఆయన ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో విధులు నిర్వహిస్తోన్న మధుసూదన్ రావు.. గత ఏడాది నవంబర్‌లో రంగారెడ్డి జిల్లా వేదికగా నిర్వహించిన టైక్వాండో పోటీల్లో ఈ ఫీట్ సాధించాడు. గతంలో 36, 140 కిక్స్ గా ఉన్న రికార్డును 56,148 కిక్కుల ద్వారా బద్దలు కొట్టిన మధుసూదన్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నమోదయిందని, ఈ మేరకు ఆ సంస్థ గుర్తింపు పత్రాలను పంపిందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు సోమవారం మీడియాకు వెల్లడించారు. మధుసూదన్ రైల్వే వీక్ అవార్డు- 2015 విజేత కూడా కావడం గమనార్హం.