కిక్లతో తెలుగు జవాన్ గిన్నిస్ రికార్డు | jawan in Guinness record for maximum full contact kicks | Sakshi
Sakshi News home page

కిక్లతో తెలుగు జవాన్ గిన్నిస్ రికార్డు

Published Mon, Jul 13 2015 8:07 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

కిక్లతో తెలుగు జవాన్ గిన్నిస్ రికార్డు - Sakshi

కిక్లతో తెలుగు జవాన్ గిన్నిస్ రికార్డు

హైదరాబాద్: కొరియన్ ఆత్మరక్షణ విద్య టైక్వాండోలో తెలుగు తేజం, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జవాన్ ఎ. మధుసూదన్ రావు గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఒక గంటలో 56, 148 ఫుల్ కాంటాక్ట్ కిక్స్ కొట్టడంద్వారా ఆయన ఈ ఘనత సాధించారు.

ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో విధులు నిర్వహిస్తోన్న మధుసూదన్ రావు.. గత ఏడాది నవంబర్లో రంగారెడ్డి జిల్లా వేదికగా నిర్వహించిన టైక్వాండో పోటీల్లో ఈ ఫీట్ సాధించాడు. గతంలో 36, 140 కిక్స్ గా ఉన్న రికార్డును 56,148 కిక్కుల ద్వారా బద్దలు కొట్టిన మధుసూదన్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నమోదయిందని, ఈ మేరకు ఆ సంస్థ గుర్తింపు పత్రాలను పంపిందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు సోమవారం మీడియాకు వెల్లడించారు. మధుసూదన్ రైల్వే వీక్ అవార్డు- 2015 విజేత కూడా కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement