
సాక్షి, అనకాపల్లి: రికార్డు నెలకొల్పాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి.. అందులోనూ గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలంటే ఎన్ని కోట్లమందిని దాటి రావాలి..! అంతటి అరుదైన ఘనతను నూటికో కోటికో ఒక్కరు సాధిస్తారు. కానీ అనకాపల్లికి చెందిన ఓ కుటుంబంలో నలుగురు ఆ రికార్డును సాధించి, సరికొత్త రికార్డు సృష్టించారు. అనకాపల్లి గవరపాలేనికి చెందిన కొణతాల విజయ్ 2012లో చైనాలో స్థిరపడ్డారు. ఆయన, ఆయన సతీమణి జ్యోతి గతంలో యోగాలో గిన్నిస్ రికార్డు సాధించారు. ఇప్పుడు తాజాగా వారి పిల్లలిద్దరూ తల్లిదండ్రుల బాటలో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు.
కొణతాల విజయ్, జ్యోతి దంపతుల కుమార్తె జస్మిత వయస్సు 14 ఏళ్లు. ఒంటి కాలుతో ఒక నిమిషంలో 168సార్లు స్కిప్పింగ్ చేసి గిన్నిస్ రికార్డు సాధించింది.
వారి కుమారుడు శంకర్ వయస్సు ఐదేళ్లు. ఒక నిమిషంలో 129 సార్లు స్కిపింగ్స్ (ఒలింపిక్ ట్రంప్లిన్స్) చేసి రికార్డు సాధించాడు. 2019లో జపనీస్ కుర్రాడు సాధించిన రికార్డును శంకర్ అధిగమించాడు.
Comments
Please login to add a commentAdd a comment