రూ.2.20 లక్షలు కాజేసింది మైనర్ కుర్రాడు
కోటవురట్ల : రామచంద్రపురం శివారు సన్యాసిరాజుపాలెంలో ఓ ఇంట్లో జరిగిన చోరీపై సాక్షిలో ‘సన్యాసిరాజుపాలెంలో చోరీ’ శీర్షికన కథనం వెలువడింది. బాధితుల వివరణతో రూ.2.50,000 నగదు, అరతులం బంగారం చోరీకి గురైనట్టు కథనం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో ఎస్‌ఐ రమేష్ చేసిన దర్యాప్తులో పురోగతి సాధించి చోరీ సొత్తు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఎస్‌ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి. సన్యాసిరాజుపాలేనికి చెందిన సింగంపల్లి వరలక్ష్మి ఇంట్లో ఈ నెల 14వ తేదీన దొంగతనం జరిగి రూ.2.20 లక్షల నగదు, అర తులం బంగారం అపహరణకు గురైంది. పోలీసులు మొదట రూ.20 వేలు నగదు, అరతులం బంగారం చోరీ జరిగినట్టుగా నమోదు చేశారు. పూర్తి విచారణలో రూ.2.20 లక్షలు నగదు, అరతులం బంగారంగా గుర్తించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో అదే గ్రామానికి చెందిన మైనర్ యువకుడు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. అతనిపై నిఘా పెట్టి ఆదివారం జల్లూరు జంక్షన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి వద్ద నుంచి రూ.2,20,000 నగదు, అరతులం బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని జువైనల్ హోమ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న పోలీసులు
చోరీ సొత్తు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment