● జిల్లాలో 4 ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీ ఎన్నికలు ● 4 ఎంపీపీ స్థానాలూ ఏకగ్రీవం, ఒక వైస్ ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కై వసం ● సబ్బవరంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల గైర్హాజరుతో వైస్‌ఎంపీపీగా స్వతంత్ర అభ్యర్థి విజయం ● కూటమి నేతల ప్రలోభాలకు చెక్ చెప్పిన వైఎస్సార్‌సీపీ సభ్యులు
సాక్షి, అనకాపల్లి :
జిల్లాలో జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఫ్యాన్ జోరు పెంచింది. జిల్లాలో జరిగిన 4 ఎంపీపీ, 2 వైస్ ఎంపీపీ స్థానాలకు గానూ 4 ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీనే కై వసం చేసుకుని విజయదుందుభి మోగించింది. మరో వైస్ ఎంపీపీ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ గైర్హాజరు కావడంతో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. కూటమి నేతలు అధికార బలంతో బెదిరింపులు, ప్రలోభాలకు తెరదీసినా వైఎస్సార్‌సీపీలోనే ఉంటాం..వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటామంటూ గెలిపించి చూపించారు. బలం లేకపోయినా గెలవాలన్న కూటమి నేతల కుట్రలకు చెక్ పెట్టారు. అనకాపల్లి జిల్లాలో ఎస్.రాయవరం, దేవరాపల్లి, మాకవరపాలెంలో ఎంపీపీలు వైఎస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాకవరపాలెంలో ఎంపీపీ ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచి కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు ఫోన్‌లు చేసి బెదిరింపులకు పాల్పడడం, ప్రలోభాలకు గురి చేయడం చేశారు. కానీ కూటమి నాయకులు ఇచ్చే తాయిలాలను తిరస్కరించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
●జిల్లాలో ఎస్.రాయవరం, దేవరాపల్లి, మాకవరపాలెం, మాడుగుల ఎంపీపీలకు ఉప ఎన్నికలు జరిగాయి. మాకవరపాలెం ఎంపీపీ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసే కుటిల ప్రయత్నాలకు కూటమి నాయకులు పాల్పడినా..వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో ఎంపీటీసీ లందరూ ఏకతాటిపై నిలిచి వైఎస్సార్‌సీపీ వెంటే ఉండి ఎంపీపీని గెలిపించారు. మాకవరపాలెం ఎంపీపీ–రుత్తల సర్వేశ్వరరావు(వైఎస్సార్‌సీపీ), ఎస్.రాయవరం ఎంపీపీ–కేసుబోయిన వెంకటలక్ష్మి (వైఎస్సార్‌సీపీ), దేవరాపల్లి ఎంపీపీ–చింతలబుల్లి లక్ష్మి (వైఎస్సార్‌సీపీ) గెలిచారు. చోడవరం వైస్ ఎంపీపీగా శరగడం లక్ష్మి(వైఎస్సార్‌సీపీ), సబ్బవరం వైస్ ఎంపీపీ–మామిడి లక్ష్మి(ఇండిపెండెంట్) గెలుపొందారు.
●పెందుర్తిలో కోఆప్టెడ్ మెంబర్‌గా ముదపాక శివ ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ ప్రతిపాధించగా..ఎంపీపీ మద్దతు పలికారు.
●అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వైస్ ఎంపీపీగా గెలిచిన మామిడి లక్ష్మి గతంలో వైఎస్సార్‌సీపీలోనే ఎంపీటీసీగా గెలిచారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నుంచి బయటకు వచ్చి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మొత్తం 19 మంది సభ్యులకు వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీలు గైర్హాజరు కావడంతో మిగిలిన 11 మంది ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు.
వెదురువాడలో
ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా
●అచ్యుతాపురం మండలంలో వెదురువాడ పంచాయతీలో ఉపసర్పంచ్ ఉప ఎన్నికలో కూటమి బలం లేకపోవడంతో ప్రలోభాలకు గురిచేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు ససేమిరా అనడంతో వాయిదా వేశారు. మాడుగుల మండలంలో కింతలి గ్రామ ఉప సర్పంచ్ ఎన్నిక శుక్రవారం నాటికి వాయిదా పడింది. అయితే ఇక్కడ ఉప సర్పంచ్‌గా పల్లా పెద్దమ్మాలు గతంలో ఉప సర్పంచ్‌గా పనిచేశారు.
●మునగపాక మండలంలో ఐదు పంచాయతీలకు గురువారం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా వాటిలో మునగపాక తప్ప ఇతర పంచాయతీలకు ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. మునగపాక ఉప సర్పంచ్‌కు సంబంధించి సభ్యులు ఎవరూ ఎన్నికకు హాజరుకాకపోవడంతో ఎన్నికల అధికారి సోమరాజు శుక్రవారం నాటికి వాయిదా వేశారు. నారాయుడుపాలెం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఉప సర్పంచ్‌గా కొయ్య నల్లయ్య, రాజుపేట కూటమి ఉప సర్పంచ్‌గా జెర్రిపోతుల కనక మహలక్ష్మి, ఒప్పందం ప్రకారం పార్టీలకతీతంగా తోటాడ ఉప సర్పంచ్‌గా కోట్ల హేమ, నాగులాపల్లి ఉప సర్పంచ్‌గా గోసాల గోవిందరాజులు ఇరు పార్టీల వారు ఎన్నుకున్నారు.
విజేతలు వీరే.. మండలం ఎంపీపీ పార్టీ కులం
మాకవరపాలెం రుత్తల శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ వెలమ
ఎస్.రాయవరం కేసుబోయిన వెంకటలక్ష్మీ వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ
దేవరాపల్లి చింతల బుల్లిలక్ష్మీ వైఎస్సార్‌సీపీ వెలమ
వి.మాడుగుల తాళ్లపురెడ్డి వెంకటరాజారాం వెఎస్సార్‌సీపీ బీసీ
వైస్ ఎంపీపీలు వీరే ..
మండలం వైస్ ఎంపీపీ పార్టీ కులం
చోడవరం శరగడం లక్ష్మి వైఎస్సార్‌సీపీ గవర
సబ్బవరం మామిడి లక్ష్మి ఇండిపెండెంట్ తూర్పు కాపు
స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి
స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి
స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి
స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి
స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి
స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి
స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి