గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్లను అందజేస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం : పురపాలక పరిధిలో మెప్మా సిబ్బంది, ఎస్‌హెచ్‌జీ సభ్యులు తయారు చేసే ఉత్పత్తులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా మార్చి 8వ తేదీ నాటికి కొనుగోలు లక్ష దాటిన సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్లు వరించాయి. గురువారం క్యాంపు కార్యాలయంలో స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు మెప్మా సిబ్బందిని అభినందించారు. ప్రతి మహిళను వ్యాపారవేత్తగా తయారు చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి సభ్యురాలు వినియోగించుకోవాలన్నారు. మెప్మా సిబ్బంది ప్రతి వార్డులో సభ్యులకు అవగాహన కల్పించి, ఆన్‌లైన్ బిజినెస్ ద్వారా ఉత్పత్తులను మార్కెట్ చేసి, ఉపాధి అవకాశాలను పెంపొందించాలన్నారు.