అమ్మన్: జోర్డాన్ కు చెందిన ప్రఖ్యాత రచయిత నహేద్ హత్తర్ ను ఆదివారం ఓ దుండగుడు ఆదివారం కోర్టు ముందు కాల్చిచంపాడు. క్రైస్తవ మతస్తుడైన హత్తర్ ఇస్లాం వ్యతిరేకి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ను సపోర్ట్ చేసేవారు. గత నెలలో బెడ్ మీద మహిళతో ఉన్న ఓ వ్యక్తి దేవుడిని మద్యం తీసుకుని రమ్మని కోరుతున్నట్లు ఆయన గీసిన చిత్రం వివాదాస్పదమైంది.
సోషల్ మీడియాలో ఇస్లాం మతాన్ని కించపరిచేవిధంగా బొమ్మను గీసి పోస్టు చేశాడని హత్తర్ పై కేసు నమోదయింది. కేసు విచారణలో భాగంగా కోర్టు విచారణకు హాజరైన హత్తర్ మెట్లు దిగుతుండగా.. ఓ వ్యక్తి కాల్చిచంపాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్తర్ ను కాల్చిచంపిన వ్యక్తికి దాదాపు 50ఏళ్ల వయసు ఉండొచ్చని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
రచయిత కాల్చివేత
Published Sun, Sep 25 2016 3:04 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
Advertisement
Advertisement