court premises
-
మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి
ముంబై: అన్ని రకాల వివాదాలను కోర్టురూమ్ల దాకా తీసుకురావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. కొన్ని వివాదాలు కోర్టురూమ్ల్లో విచారణకు సరిపడవని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్యవర్తులతో చాలాసార్లు అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సృజనాత్మక పరిష్కారాలు లభిస్తాయని, మనుషుల మధ్య బంధాలు బలపడతాయని వెల్లడించారు. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం కూడా ఒక చక్కటి మార్గమని పేర్కొన్నారు. శనివారం నాగపూర్‌లో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ(ఎంఎన్‌ఎల్‌యూ) మూడో స్నాతకోత్సవంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడారు. ప్రతి కేసునూ చట్టపరమైన అంశం అనే కోణంలో చూడొద్దని, వాటిని మానవీయ కథనాలుగా పరిగణించాలని చెప్పారు. మన దేశంలో కక్షిదారులకు న్యాయ సహాయం అందించే వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు. ప్రపంచంలో ఇలాంటిది బహుశా ఎక్కడా లేకపోవచ్చని వ్యాఖ్యానించారు. మన దగ్గర కక్షిదారులందరికీ ఏదోరకంగా న్యాయ సహాయం లభిస్తోందన్నారు. ఏవైనా వివాదాలు తలెత్తగానే కోర్టుల్లో వ్యాజ్యాలు, విచారణల వరకూ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం అని వివరించారు. అక్కడ కొన్నిసార్లు అవును లేదా కాదు అనే మాటలతోనే వివాదాలు పరిష్కారమవుతుంటాయని గుర్తుచేశారు. మధ్యవర్తిత్వం అనే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా మనుషుల మధ్య, వ్యాపార సంస్థల మధ్య సంబంధాలు బలపడతాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉద్ఘాటించారు. -
కోర్టు ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అనంతపురం క్రైం: అనంతపురంలోని తపోవనానికి చెందిన నారాయణస్వామి మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు... నగరంలోని ప్రశాంతినగర్‌కు చెందిన జి.ఆదినారాయణకు బళ్లారి బైపాస్ ప్రాంతంలో స్థలం ఉంది. ఈ స్థలంలోని షెడ్డులో నారాయణస్వామి కూల్‌డ్రింక్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరి మధ్య కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. గత నెల 5న షెడ్డు వద్ద నారాయణస్వామి, కుటుంబసభ్యులు వాగ్వాదం చేసుకుంటున్న సమయంలో ఆదినారాయణ, అతని కుమారుడు నవీన్‌కుమార్ అక్కడికెళ్లారు. షాపు ఖాళీ చేసి తీరాలంటూ గట్టిగా హెచ్చరించారు. ఆ సమయంలో నవీన్‌కుమార్‌పై నారాయణస్వామి కుమారుడు పవన్ దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నారాయణస్వామి, ఆయన భార్య అంజినమ్మ, కుమారుడు పవన్‌పై ఐపీసీ 324 సెక్షన్ కింద అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఊండ్ సర్టిఫికెట్ ఆధారంగా మరో సెక్షన్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ విషయంగా విచారణకు స్టేషన్‌కు రావాలని నిందితులకు సూచించారు. అప్పటి నుంచి నిందితులు అందుబాటులో లేకుండా పోయారు. మంగళవారం ఉదయం కోర్టు ఆవరణలో నారాయణస్వామి, అంజినమ్మ ప్రత్యక్షమయ్యారు. నారాయణస్వామి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి జడ్జి ఓంకార్ ముందుకెళ్లి రూరల్ పోలీసులు అన్యాయం చేస్తున్నారంటూ వాపోయాడు. విషయం తెలుసుకున్న న్యాయమూర్తి ఆదేశాల మేరకు.. కోర్టు సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమై నారాయణస్వామిని ఆటోలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి: మంత్రి పెద్దిరెడ్డి) -
ఎస్సై నిర్వాకం: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. పెళ్లాడాడు.. చివరకు
సాక్షి, ఆత్మకూరు: అదనపుకట్నం కోసం భార్యను వేధించారన్న కేసులో వాయిదాకు హాజరైన ఓ ఎస్సై కోర్టు ప్రాంగణంలో భార్యపై దాడికి పాల్పడిన ఘటన ఆత్మకూరు ఫ్యామిలీ కోర్టులో బుధవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. సంగం మండలానికి చెందిన కురకూటి లావణ్య ఇంజినీరింగ్ చదివింది. సమీప బంధువు అయిన చెంగా నాగార్జున ప్రేమిస్తున్నానంటూ ఆమెను వెంటపడ్డాడు. బంధువులతో మాట్లాడి 2017వ సంవత్సరం జొన్నవాడ ఆలయంలో వారు వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో రూ.10 లక్షల నగదు కట్నంగా ఇచ్చినట్లుగా లావణ్య కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఏడాది పాటు వారి కాపురం సజావుగా సాగింది. కొంతకాలానికి నాగార్జునకు ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. అనంతపురం ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందాడు. కాగా లావణ్యను దూరంగా పెట్టాడు. కొన్నినెలల అనంతరం అతడికి గుంటూరు జిల్లా అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో పోస్టింగ్ వచ్చింది. అప్పుడు లావణ్య వెళ్లి కలవడంతో తనకు ఎస్సైగా ఉద్యోగం వచ్చిందని, అదనంగా రూ.50 లక్షలు కట్నం ఇవ్వాలని నాగార్జున డిమాండ్ చేశాడు. దీనిపై స్టేషన్లోనే వారి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. చదవండి: (పెళ్లైనప్పటి నుంచే పద్మజ అంటే చిన్నచూపు.. అనుమానంతో) ఇదేక్రమంలో సంగం గ్రామానికి చెందిన మరో యువతితో నాగార్జున ప్రేమాయణం సాగిస్తున్నాడని లావణ్య గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టుకెళ్లింది. విచారణ చేసిన ఎస్పీ రెండునెలల క్రితం నాగార్జునను వీఆర్‌కు పంపించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆత్మకూరు ఫ్యామిలీ కోర్టులో విచారణకు హాజరైన నాగార్జున, అతని తండ్రి నాగేశ్వరరావు అక్కడి ఆవరణలోనే లావణ్యతోపాటు ఆమె తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు. సమీపంలోని లాయర్లు వచ్చి వారిని వారించారు. వెంటనే న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్తడంతో కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. గాయపడిన లావణ్యను పోలీసులు ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇప్పటికే రెండుమార్లు నాగార్జున తనను చంపేస్తానని చెప్పి బెదిరించాడని, తనకు న్యాయం చేయాలని లావణ్య కోరింది. కేసు నమోదు చేసినట్లుగా ఆత్మకూరు పోలీసులు తెలిపారు. చదవండి: (కలిసి మద్యం తాగారు.. ఊపిరి ఉండగానే పాతేశారు) -
మున్ముందు కోర్టు హాళ్లూ చిన్నవి అవుతాయి
పణాజి: సాంకేతికత కారణంగా భవిష్యత్తులో కోర్టు ప్రాంగణాలు, కోర్టు గదులు కూడా చిన్నవిగా మారి పోతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే తెలిపారు. న్యాయం అందించే విషయంలో కరోనా మహమ్మారి పలు సవాళ్లు విసిరినప్పటికీ, ఆ పరిణామం కోర్టుల నవీకరణకు బాటలు వేసిందని ఆయన తెలిపారు. శనివారం పోర్వోరిమ్‌లో ముంబై హైకోర్టు గోవా ధర్మాసనం కొత్త భవనం ప్రారంభించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. ‘రవి శంకర్ ప్రసాద్ మంత్రిత్వం కారణంగానే కోర్టు గదులు చిన్నవిగా మారుతున్న పరిణామాన్ని చూస్తున్నాను. అదేవిధంగా, భారీగా ఉండే కోర్టు పత్రాలను భద్రపరిచేందుకు చాలా గదులుండేవి. కానీ, ఈ–ఫైలింగ్, డేటా రాకతో ఇకపై పెద్ద సంఖ్యలో గదుల అవసరం కూడా ఉండదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కనీస ప్రమాణాలు, ప్రణాళికలను రూపొందించింది’అని ఆయన చెప్పారు. ‘మౌలిక వసతులపై చర్చించేటప్పుడు కొత్త భవనాల నిర్మాణం అంశమే ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుంది. ఇవి అవసరమే అయినప్పటికీ ఇప్పటికే ఉన్న వాటిని ఆధునీకరించాల్సి ఉంది’అని సీజేఐ అన్నారు. ముంబై హైకోర్టుకు కొత్త భవనం నిర్మించాలన్న ఆయన..‘అప్పట్లో కేవలం ఏడుగురు జడ్జీలకు మాత్రమే సరిపోయే విధంగా నిర్మించారు. కానీ, ఇప్పుడు అక్కడ 40 మందికి పైగా జడ్జీలు విధులు నిర్వర్తిస్తున్నారు’అని వివరించారు. నాలుగున్నర శతాబ్ధాల ఘన చరిత్ర గోవా న్యాయవ్యవస్థకు ఉందని సీజేఐ జస్టిస్ బాబ్డే చెప్పారు. పోర్చుగీస్ పాలకులు ఆసియాలోనే మొట్టమొదటి హైకోర్టును 1544లో గోవాలోనే ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. గోవా ధర్మాసనంలోని ముగ్గురు జడ్జీల్లో తను కూడా ఉన్నానని, తనను కొందరు గోవా జడ్జీగా పేర్కొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మౌలిక వసతుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: జస్టిస్ రమణ ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ అవసరాలు తీర్చేందుకు వీలుగా ప్రత్యేకంగా జాతీయ న్యాయ మౌలిక వసతుల కార్పొరేషన్ అవసరం ఉందని చెప్పారు. దీనిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాలని కోరారు. ఈ కొత్త కార్పొరేషన్ న్యాయ వ్యవస్థ మౌలిక వసతుల్లో విప్లవాత్మక మార్పులకు అవసరమైన ఏకరూపకత, ప్రామాణీకరణను తెస్తుందని చెప్పారు. అన్ని కోర్టులకు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం, కోర్టు పత్రాల ఈ–ఫైలింగ్‌కు ఏర్పాట్లు చేయడం వంటివి కూడా మౌలిక వసతుల కిందికే వస్తాయని వివరించారు. ‘శిథిలావస్థకు చేరిన నిర్మాణాల్లో కోర్టులను నిర్వహిస్తున్న ఉదాహరణలను మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల రికార్డు గదులు కూడా ఉండటం లేదు. వాష్ రూంలు, వెయిటింగ్ గదులు లేని కోర్టు ప్రాంగణాలు కూడా ఉన్నాయి’అని ఆయన తెలిపారు. కరోనా కారణంగా కేసుల విచారణ వర్చువల్‌గా సాగుతుండటంతో కోర్టులను ప్రజల గుమ్మం ముందుకు తీసుకెళ్లినట్లయిం దన్నారు. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌లు హాజరయ్యారు. -
రచయిత కాల్చివేత
అమ్మన్: జోర్డాన్ కు చెందిన ప్రఖ్యాత రచయిత నహేద్ హత్తర్ ను ఆదివారం ఓ దుండగుడు ఆదివారం కోర్టు ముందు కాల్చిచంపాడు. క్రైస్తవ మతస్తుడైన హత్తర్ ఇస్లాం వ్యతిరేకి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ను సపోర్ట్ చేసేవారు. గత నెలలో బెడ్ మీద మహిళతో ఉన్న ఓ వ్యక్తి దేవుడిని మద్యం తీసుకుని రమ్మని కోరుతున్నట్లు ఆయన గీసిన చిత్రం వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో ఇస్లాం మతాన్ని కించపరిచేవిధంగా బొమ్మను గీసి పోస్టు చేశాడని హత్తర్ పై కేసు నమోదయింది. కేసు విచారణలో భాగంగా కోర్టు విచారణకు హాజరైన హత్తర్ మెట్లు దిగుతుండగా.. ఓ వ్యక్తి కాల్చిచంపాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్తర్ ను కాల్చిచంపిన వ్యక్తికి దాదాపు 50ఏళ్ల వయసు ఉండొచ్చని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. -
నెల్లూరులో బాంబు పేలుడు ఘటనపై విచారణ
-
ఎవరి పని?.. టార్గెట్ ఎవరు?
కోర్టు ఆవరణలో బాంబు పేలుడుపై ఎన్నో అనుమానాలు చిత్తూరులో కలకలం జిల్లా కేంద్రమైన చిత్తూరు హత్యలు, బాంబు పేలుళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఐదు నెలల క్రితం దుండగులు స్థానిక మేయర్ దంపతులను అతికిరాతకంగా హతమార్చారు. ఆ రక్తపు మరకలు చెరగకముందే గురువారం పట్టపగలే కోర్టు ఆవరణలో బాంబులు పెట్టి కలకలం సృష్టించారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. అయితే దీనివెనుక ఎవరి హస్తముంది.. టార్గెట్ ఎవరు..? అనేది ఎవరికీ అంతుపట్టని పరిస్థితి. మేయర్ దంపతులను హతమార్చినవారిని మట్టుబెట్టడానికే ప్రత్యర్థులు పథకం వేశారా.. లేక నిందితులు కేసు విచారణను వేరే జిల్లాకు మార్చుకునేందుకు పథకం పన్నారా.? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. చిత్తూరు (అర్బన్): చిత్తూరు నడిబొడ్డున ఉన్న కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అనురాధ దంపతుల్ని అతి కిరాతంగా హత్య చేసిన ఘటన మరువకముందే ఇప్పుడు కోర్టు ఆవరణలో బాంబు పేలు డు కలకలం సృష్టించింది. త్రుటిలో తప్పిందిగానీ..! లేకుంటే ఈ ఘటనలో ఊహించని రీతిలో ప్రాణ నష్టం జరిగేది. ఎవరో? కోర్టు ఆవరణలో జరిగిన పేలుడు పలు నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితులుగా ఉన్న వాళ్ల కోసమే జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎవరిని లక్ష్యంగా చేసుకుని బాంబు పేల్చారనే దానిపై స్పష్టతరావడంలేదు. గత ఏడాది నవంబర్ 17న జరిగిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో చింటూ ప్రధాన నిందితుడిగా మొత్తం 23 మందిపై పోలీసులు కేసులు నమోదుచేసి అరెస్టు చేశారు. అయితే గత సోమవారం ఈ కేసు విచారణ ప్రధాన ఘట్టానికి చేరుకుంది. జంట హత్యల కేసుల విచారణను జిల్లా సెషన్స్ న్యాయస్థానానికి బదిలీ చేస్తూ, మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణకు షెడ్యుల్ విడుదల చేసి నిందితులను, సాక్ష్యులను విచారించడమే తరువాయి. ఇలాంటి సమయంలో చిత్తూరు కోర్టులో జరిగిన పేలుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యర్థుల పనేనా? ఈ ఘటనలో మరో వాదన కూడా వినిపిస్తోంది. చింటూ లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు ఎవరైనా బాంబు పేల్చారా..? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చింటూ మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానానికి హాజరై వెళుతుండగా అతన్ని లక్ష్యంగా చేసుకుని పేలుడు పదార్థాన్ని తరలించడాని ప్రయత్నిస్తూ పొరపాటున బాంబు పేలిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిఘా ఏదీ? చిత్తూరు కోర్టులో చోటుచేసుకున్న ఘటన మరోమారు పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. మేయర్ దంపతుల హత్య కేసులో పరువు పోగొట్టున్న పోలీసు శాఖకు కోర్టులో బాంబు పేలుడు ఘటన అధికారు ల పనితీరును ప్రశ్నిస్తోంది. జంట హత్యల కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న పది మంది బెయిల్‌పై విడుదలయ్యారు. అలాగే ఈ కేసుల్లో అక్రమ ఆయుధాలు కలిగి ఉండ టం, చింటూకు సన్నిహితంగా ఉన్న పలువురు అరెస్ట్ అయినా బెయిల్‌పై ఉన్నారు. వీళ్ల కదలికలపై నిఘా ఉంచడం, బెయిల్‌పై వచ్చిన వాళ్లు ఎక్కడెక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? ఎవరెవరితో మాట్లాడుతున్నారు..? అనే వివరాలను తెలుసుకోవాల్సిన స్పెషల్ బ్రాంచ్, నిఘా వర్గాలు ఆదిశగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కోర్టులో పేలుడు హేయమైన చర్య చిత్తూరు కోర్టు ప్రాంగణంలో గురువారం జరిగిన బాంబు పేలుడు అత్యంత హేయమైన చర్య. ఇలాంటి ఘటనలు జరగడం శోచనీయం. ఈ ఘటనకు పాల్పడ్డ వాళ్లు ఎంతటి వారైనా వదలకూడదు. పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. - పులికల్లు రవీంద్రనాథ రెడ్డి, చిత్తూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కోర్టులో పేలుడు ఘటన ప్రజల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. దోషుల్ని న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలి. -వీ. సురేంద్రకుమార్, ఆలిండియా లాయర్స్ యూనియన్ చిత్తూరు విభాగం అధ్యక్షుడు అందరికీ రక్షణ కల్పించాలి చిత్తూరులో కోర్టులో జరిగిన పేలుడు ఘటనను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీరియస్‌గా పరిగణించి ఇక్కడ అందరికీ రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలి. గాయపడ్డ న్యాయవాద గుమస్తా బాలాజీ వైద్యానికి అయ్యేక ఖర్చు ప్రభుత్వమే ఖర్చులు భరించాలి. - సుగుణ శేఖర్ రెడ్డి, ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలూ) చిత్తూరు విభాగం కార్యదర్శి -
చిత్తూరు కోర్టులో బాంబు పేలుడు
* జడ్జీల ప్రొటోకాల్ వాహనం కింద పేలిన బాంబు * న్యాయవాది గుమస్తాకు తీవ్రగాయాలు * చింటూ కోర్టు బయటకు వెళ్లగానే పేలుడు * సంఘటనపై ఆరా తీసిన ఏపీ ముఖ్యమంత్రి చిత్తూరు(అర్బన్): చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో గురువారం బాంబు పేలింది. మధ్యాహ్నం 12.03 గంటల సమయంలో జిల్లా, సెషన్స్ కోర్టు ఎదుట ఉన్న వాహనాల పార్కింగ్ షెడ్డులో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో న్యాయవాది గుమస్తాగా పని చేస్తున్న బాలాజీ(54) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో బాలాజీ కాలికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు అతడి పాదం పూర్తిగా తొలగించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు చిత్తూరు వచ్చే సందర్భాల్లో వారి సేవల కోసం వినియోగించే ప్రొటోకాల్ వాహనం(బొలేరో) కింద గంధకం(ఫాస్ఫరస్) పొడికి, బ్యాటరీ అమర్చిన దుండగులు రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చారు. పేలుడు జరిగినప్పుడు కోర్టు ఆవరణలో వందల సంఖ్యలో కక్షిదారులు, పోలీసులు, న్యాయవాదులు ఉన్నారు. బాంబు పేలుడు నేపథ్యంలో న్యాయస్థానాల సముదాయంలో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. పేలుడుకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. చింటూయే లక్ష్యమా?: 2007లో చిత్తూరులోని పలమనేరు రోడ్డులో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు లక్ష్యంగా జరిగిన కాల్పుల ఘటనపై ఇదే కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కటారి మోహన్, రెండో నిందితుడు చింటూ. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చింటూను సీకే బాబుపై హత్యాయత్నం కేసులో విచారణ నిమిత్తం గురువారం పోలీసులు న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 22కు వాయిదా వేశారు. చింటూను పోలీసులు మధ్యాహ్నం 11.55 గంటల సమయంలో న్యాయస్థానాల సముదాయం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత 8 నిమిషాలకే కోర్టులో బాంబు పేలడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు కోర్టులో జరిగిన పేలుడు ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఆయన చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్‌కు ఫోన్‌చేసి, వివరాలను తెలుసుకున్నారు. -
నిర్మల్‌లో బాంబు కలకలం..
నిర్మల్ అర్బన్/నిర్మల్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలోని కోర్టు ఆవరణలో బాంబు ఉందంటూ మంగళవారం వచ్చిన ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కోర్టు ఆవరణలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు ఉరుకులుపరుగులు పెట్టారు. బాంబుస్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలో దింపి కోర్టు భవనం అణువణువూ పరిశీలించారు. గంట పాటు కోర్టు ఆవరణలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి ఏమీ లేదని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, వచ్చిన ఫోన్ కాల్‌పై విచారణ జరుపుతున్నట్లు రూరల్ సీఐ పురుషోత్తమాచారి విలేకరులకు తెలిపారు. -
కోర్టు ఆవరణలో మహిళ ఆత్మహత్యాయత్నం
కైకలూరు(కృష్ణా జిల్లా): కోర్టు ఆవరణలో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన కృష్ణాజిల్లా కైకలూరులో సోమవారం కలకలం సృష్టించింది. జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ఉండగానే మొదటి గేటు సమీపంలో మహిళ ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భర్తకు సంబంధించిన ఆస్తిని అత్త విక్రయించడానికి ప్రయత్నించడంతో ఆమె ఈ చర్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం వణుదుర్రు గ్రామానికి చెందిన నాగలక్ష్మికి కలిదిండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మారగాని నాగేశ్వరరావుతో 1999లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భర్త మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడంటూ 2011లో భర్త, అత్త వెంకటలక్ష్మిపై కైకలూరు కోర్టులో బాధిత మహిళ కేసు వేసింది. అనంతరం ఆమె కూలి పనులు చేసుకుంటూ తల్లి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో భర్తకు చెందిన ఆస్తిని అత్త విక్రయించేందుకు ప్రయత్నిస్తుండడంతో పాటు భర్త తరఫు న్యాయవాది రాజీకి రావాలంటూ ఆమెను వేధిస్తున్నారు. తన పిల్లలకు అన్యాయం జరుగుతుందన్న భయంతోనే నాగలక్ష్మి ఆత్మహత్యకు యత్నించింది. -
నెల్లూరు జిల్లాలో న్యాయవాదుల ఆందోళన
నెల్లూరు : ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ జిల్లా కోర్టులో ఓ న్యాయవాదిని పోలీసులు కాల్చి చంపినందుకు నిరసనగా నెల్లూరు జిల్లాలో న్యాయవాదుల విధులు బహిష్కరించారు. జిల్లాలోని కోర్టుల ఎదుట గురువారం వారు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంతో కోర్టుకు వచ్చిన పలువురు కక్షిదారులు ఇబ్బంది పడ్డారు. జిల్లా వ్యాప్తంగా న్యాయవాదుల చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. (చదవండి : కోర్టులో పోలీసు కాల్పులు.. న్యాయవాది మృతి) -
కోర్టులో పోలీసు కాల్పులు.. న్యాయవాది మృతి
అలహాబాద్: అలహాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో పోలీసులు.. న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ లాయర్ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కోర్టులో ఉద్రిక్తతను చల్లార్చేందుకు ఓ ఎస్ఐ జరిపిన కాల్పుల్లో ఓ లాయర్ మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. లాయర్లు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే కాల్పుల ఘటనతో కోర్టు ఆవరణలో ఉన్న లాయర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లాయర్లు పోలీసులతో ఘర్షణకు దిగి.. కోర్టు ఆవరణలోని వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కూతవేటు దూరంలో అలహాబాద్ హైకోర్టులోని న్యాయవాదులకు సమాచారం అందడంతో అక్కడి న్యాయవాదులు రెచ్చిపోయారు. అలహాబాద్ - కాన్పూర్ జాతీయరహదారిపై వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం... కోర్టు ఆవరణలో ఘర్షణకు దిగిన లాయర్లను అదుపులోకి తీసుకొచ్చేందుకే ఎస్ఐ కాల్పులు జరిపారని చెప్పారు. ఆ కాల్పులు జరిపింది ఎవరో ఇంకా నిర్థరించలేదని పోలీసు శాఖ ప్రతినిధి మృత్యుంజయ మిశ్రా తెలిపారు. మృతి చెందిన న్యాయవాది రోషన్ అహ్మద్‌గా గుర్తించారు. గాయపడిన న్యాయవాది ఫిరోజ్ నబీ అని పోలీసులు తెలిపారు. ఘటన స్థలం వద్దకు పోలీసులు ఉన్నతాధికారులతో పాటు న్యాయమూర్తులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
కోర్టుకు స్టాలిన్
సాక్షి, చెన్నై : కట్టుదిట్టమైన భద్రత నడుమ డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సోమవారం దిండుగల్ కోర్టుకు హాజ రయ్యారు. డీఎంకే నాయకులు, పోలీ సుల మధ్య చోటు చేసుకున్న వివా దం లాఠీచార్జ్‌కు దారి తీసింది. దిండుగల్‌లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి జే జయలలితను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రా లు సంధించారు. దీన్ని తీవ్రంగా పరి గణించిన రాష్ట్ర ప్రభుత్వం సీఎం జయలలితపై నిరాధార ఆరోపణలు చేశారంటూ స్టాలిన్‌పై పరువు నష్టం దావా దాఖలు చేసింది. గత నెల ఈ దావా విచారణకు వచ్చింది. స్వయం గా విచారణకు హాజరు కావాలని స్టాలిన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఫెక్సీల వివాదం: కోర్టుకు తమ నేత హాజరు కాబోతుం డటాన్ని దృష్టిలో పెట్టుకున్న డీఎంకే వర్గాలు అత్యుత్సాహం ప్రదర్శిం చా యి. దిండుగల్‌లో అక్కడక్కడా ముం దుగానే ఆహ్వాన ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశాయి. రెండు రోజుల క్రితం ఈ ఫ్లెక్సీలు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఘర్షణకు దారి తీశాయి. దీంతో స్టాలిన్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రత నడుమ కోర్టుకు : విచారణ నిమిత్తం ఆదివారం చెన్నై నుంచి విమానంలో స్టాలిన్ మదురైకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దిండుగల్‌కు వెళ్లారు. స్టాలి న్ వెంట డీఎంకే న్యాయ విభాగం నేతలు ఆలందరూరు కేఎస్ భారతి, కేఎస్ రాధాకృష్ణన్, ఎంపీ సుగవనం ఉన్నారు. స్టాలిన్ కాన్వాయ్ దిండుగల్లోకి చేరుకోగానే అక్కడి నేతలు పెరియ స్వామి, ఎమ్మెల్యే చక్రపాణి నేతృత్వంలో ఘనస్వాగతం పలికా రు. స్టాలిన్ పర్యటనలో అవాంఛనీ య సంఘటనలు చోటుచేసుకోకుం డా జిల్లా ఎస్పీ జయచంద్రన్ నేతృత్వంలో వెయ్యి మంది సిబ్బందితో కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్ర తా ఏర్పాట్లు చేశారు. గట్టి భద్రత నడుమ దిండుగల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బాలసుందర కుమార్ ఎదుట విచారణ నిమిత్తం స్టాలిన్ హాజరయ్యారు. తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేశారు. భయపడం: కోర్టు వెలుపల మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, ఎన్ని కేసుల్ని వేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. డీఎంకే నాయకులను టార్గెట్ చేశారని ధ్వజమెత్తారు. భయపెట్టి, బెదిరించి తమ వాళ్లను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి వాటికి తలొగ్గే కార్యకర్తలు, నాయకులు డీఎంకేలో లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికార పక్షానికి హితవు పలి కారు. 13 ఏళ్లుగా బెంగళూరులో జరుగుతున్న ఆస్తుల కేసుల్లో వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్న వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు ప్రజ లు సిద్ధమవుతోన్నారని సీఎం జయలలితను ఉద్దేశించి విమర్శించారు. లాఠీ చార్జ్ స్టాలిన్ కోర్టు నుంచి బయటకు వెళ్లా రో లేదో వివాదం రాజుకుంది. స్టాలి న్కు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించే పనిలో పోలీసులు పడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే వర్గాలు ఆందోళనకు దిగాయి. పోలీసుల చర్యల్ని ప్రతిఘటించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, డీఎంకే వర్గా ల మధ్య వాగ్యుద్ధం ముదరడంతో లాఠీ చార్జ్‌కు దారి తీసింది. అక్కడున్న వారందర్నీ తరిమితరిమి కొట్టా రు. పరిస్థితి అదుపు తప్పకుండా ఆ పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.