కోర్టుకు స్టాలిన్
Published Tue, Nov 26 2013 2:24 AM | Last Updated on Tue, Aug 21 2018 7:25 PM
సాక్షి, చెన్నై : కట్టుదిట్టమైన భద్రత నడుమ డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సోమవారం దిండుగల్ కోర్టుకు హాజ రయ్యారు. డీఎంకే నాయకులు, పోలీ సుల మధ్య చోటు చేసుకున్న వివా దం లాఠీచార్జ్‌కు దారి తీసింది. దిండుగల్‌లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి జే జయలలితను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రా లు సంధించారు. దీన్ని తీవ్రంగా పరి గణించిన రాష్ట్ర ప్రభుత్వం సీఎం జయలలితపై నిరాధార ఆరోపణలు చేశారంటూ స్టాలిన్‌పై పరువు నష్టం దావా దాఖలు చేసింది. గత నెల ఈ దావా విచారణకు వచ్చింది. స్వయం గా విచారణకు హాజరు కావాలని స్టాలిన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది.
ఫెక్సీల వివాదం:
కోర్టుకు తమ నేత హాజరు కాబోతుం డటాన్ని దృష్టిలో పెట్టుకున్న డీఎంకే వర్గాలు అత్యుత్సాహం ప్రదర్శిం చా యి. దిండుగల్‌లో అక్కడక్కడా ముం దుగానే ఆహ్వాన ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశాయి. రెండు రోజుల క్రితం ఈ ఫ్లెక్సీలు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఘర్షణకు దారి తీశాయి. దీంతో స్టాలిన్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
భద్రత నడుమ కోర్టుకు :
విచారణ నిమిత్తం ఆదివారం చెన్నై నుంచి విమానంలో స్టాలిన్ మదురైకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దిండుగల్‌కు వెళ్లారు. స్టాలి న్ వెంట డీఎంకే న్యాయ విభాగం నేతలు ఆలందరూరు కేఎస్ భారతి, కేఎస్ రాధాకృష్ణన్, ఎంపీ సుగవనం ఉన్నారు. స్టాలిన్ కాన్వాయ్ దిండుగల్‌లోకి చేరుకోగానే అక్కడి నేతలు పెరియ స్వామి, ఎమ్మెల్యే చక్రపాణి నేతృత్వంలో ఘనస్వాగతం పలికా రు. స్టాలిన్ పర్యటనలో అవాంఛనీ య సంఘటనలు చోటుచేసుకోకుం డా జిల్లా ఎస్పీ జయచంద్రన్ నేతృత్వంలో వెయ్యి మంది సిబ్బందితో కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్ర తా ఏర్పాట్లు చేశారు. గట్టి భద్రత నడుమ దిండుగల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బాలసుందర కుమార్ ఎదుట విచారణ నిమిత్తం స్టాలిన్ హాజరయ్యారు. తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేశారు.
భయపడం:
కోర్టు వెలుపల మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, ఎన్ని కేసుల్ని వేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. డీఎంకే నాయకులను టార్గెట్ చేశారని ధ్వజమెత్తారు. భయపెట్టి, బెదిరించి తమ వాళ్లను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి వాటికి తలొగ్గే కార్యకర్తలు, నాయకులు డీఎంకేలో లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికార పక్షానికి హితవు పలి కారు. 13 ఏళ్లుగా బెంగళూరులో జరుగుతున్న ఆస్తుల కేసుల్లో వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్న వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు ప్రజ లు సిద్ధమవుతోన్నారని సీఎం జయలలితను ఉద్దేశించి విమర్శించారు.
లాఠీ చార్జ్
స్టాలిన్ కోర్టు నుంచి బయటకు వెళ్లా రో లేదో వివాదం రాజుకుంది. స్టాలి న్‌కు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించే పనిలో పోలీసులు పడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే వర్గాలు ఆందోళనకు దిగాయి. పోలీసుల చర్యల్ని ప్రతిఘటించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, డీఎంకే వర్గా ల మధ్య వాగ్యుద్ధం ముదరడంతో లాఠీ చార్జ్‌కు దారి తీసింది. అక్కడున్న వారందర్నీ తరిమితరిమి కొట్టా రు. పరిస్థితి అదుపు తప్పకుండా ఆ పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
Advertisement
Advertisement