మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌పై శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. కుడి, ఎడమ భుజాల్లోకి రెండు తూటాలు దూసుకెళ్లాయి. శస్త్రచికిత్స చేసిన వైద్యులు పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కాల్పుల ఘటనపై విక్రమ్ నోరు మెదపట్లేదు. దీంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఇంట్లోని సీసీ కెమెరాలు పని చేయకపోవడం, సమీపంలో కెమెరాలు లేకపోవడంతో కీలకాధారాలు లభించలేదు. అప్పులు పెరిగిపోవడంతోపాటు తనను దూరంగా ఉంచుతున్న కుటుంబీకులను బెదిరించేందు కు ఆయనే కాల్చుకొని ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.