దేశా రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అప్ఘాన్‌కి చెందిన 35 ఏళ్ల జిమ్ యజమానికి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తరంజన్ పార్క్‌లో నివశిస్తున్న అఫ్ఘాన్‌కు చెందిన జిమ్ యజమాని నాదిర్ షా పార్క్ చేసిన రెండు కార్ల పక్కన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. సరిగ్గా గురువారం రాత్రి 10.40 గంటలకు గళ్లచొక్కా ధరించిన వ్యక్తి ఆ ఇద్దరు వ్యక్తులపై అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో నాదిర్ షా తీవ్రంగా గాయపడగా, మరొక వ్యక్తి ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అనతరం దుండగుడు కొన్ని మీటర్ల దూరంలో పార్క్ చేసిన మోటార్ సైకిల్‌పై ఎక్కి తప్పించుకున్నాడు. దుండగడు దాదాపు ఆరు నుంచి ఎనిమి రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. అలాగే ఘటనా స్థలంలో బుల్లెట్ ప్రక్షేపకాలు, ఖాళీ కాట్రడ్జ్‌లు లభించాయి. తీవ్రంగా గాయపడిన బాధితుడు నాదిర్ షాను మాక్స్ ఆస్పత్రికి తరలించగా..అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని వెల్లడించారు అధికారులు.
అయితే దాడి చేసిన వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి అతడిపై కాల్పులు జరిపి పారిపోయారని చెబుతున్నారు . అయితే బాధితుడు నాదిర్ షాకి దుబాయ్‌లో పలు వ్యాపారాలు ఉన్నాయని, అలాగే అతడిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అంతేగాదు అతడు ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారులకు తెలిసిన పోలీస్ ఇన్‌ఫార్మర్ అని అధికారిక వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా..ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ సన్నిహితుడు రోహిత్ గోదారా పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ పెద్ద దుమారం రేపింది. ఆ పోస్ట్‌లో తీహార్ జైలులో ఉన్న తన సన్నిహితుడు సమీర్ బాబా వ్యాపార ఒప్పందాలను అడ్డుకోవడంతోనే తాను నాదిర్ షాను అంతమొందించాలని తన సహాయకులను ఆదేశించినట్లు రోహిత్ గోదారా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు. పైగా ఎవరైనా ఆ ధైర్యం చేస్తే వారికి అదే గతిపడుతుందని హెచ్చరించడం గమనార్హం.
(చదవండి: వేధించే ఎన్‌ఆర్‌ఐ భర్తలపై కొరడా)
Comments
Please login to add a commentAdd a comment