అమెరికాలో గతేడాది నుంచి వరుస కాల్పుల ఘటనలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ప్రజలు దుండగులు కాల్పుల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక యూనివర్సిటీ సైతం కాల్పులు జరిగే అవకాశం ఉందంటూ హడావిడి చేసింది. అందుకోసం యూనివర్సిటీ ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించి ట్విట్టర్ వేదికగా విద్యార్థులను అప్రమత్తం చేసింది కూడా. ఈ అనూహ్య ఘటన అమెరికాలోని నార్మన్‌లో ఉన్న ఓక్లహోమ్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..ఓక్లహోమ్ యూనివర్సిటీలో ఓ సాయుధుడు కాల్పులు జరుపుతున్నాడని విద్యార్థులను అప్రమత్తంగా ఉండండి అంటూ యూనివర్సటీ అధికారులు ట్విట్టర్ వేదికగా సర్క్యూలర్ జారీ చేశారు. అత్యవసర పరిస్థితని కూడా ప్రకటించింది. పైగా క్యాంపస్‌లో విద్యార్థులు ఉంటే పరిగెత్తండి, దాక్కోండి లేదా ఆత్మరక్షణ కోసం ఫైట్ చేయండి అంటూ ట్వీట్ చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యూనివర్సిటీ మొత్తం సోదా చేయగా.. అలాంటిదేమీ లేదని తేలింది. వెంటనే యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌కి ఎలాంటి ముప్పు లేదంటూ ఆ హెచ్చరికను కూడా రద్దు చేసింది. ఇటీవలే నాషేవిల్లే పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు చిన్నారులతో సహా ఒక ఉపాద్యాయుడు మృతి చెందిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గత కొంతకాలంగా కళాశాల, పాఠశాలల్లోనే కాల్పులు చోటు చేసుకోవడంతో ఈ తుపాకీ హింసతో అమెరికా వాసులు బెంబేలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది.
OU-NORMAN Critical 10:53pm: OUPD has issued an ALL CLEAR. After a thorough search, no threat was found. There is no threat to campus. Alert has been canceled.
— Univ. of Oklahoma (@UofOklahoma) April 8, 2023
(చదవండి: పాక్ 2026 నాటికి చైనా, సౌదీ అరేబియాలకు రూ. 63 వేల కోట్లు చెల్లించాలి)
Comments
Please login to add a commentAdd a comment