
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. నిన్న గుర్గావ్‌లో స్కూలు బస్సుపై దాడి ఉదంతం రేపిన ఆందోళన ఇంకా చల్లారకముందే ఢిల్లీలో మరో ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. తూర్పుఢిల్లీలో ఒక స్కూలు బస్సుపై అగంతకులు దాడిచేశారు. డ్రైవర్‌పై కాల్పులు జరిపి ఒక విద్యార్థిని కిడ్నాప్ చేశారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని నగరంలో జరిగిన ఈ ఘటన ఉద్రిక్తతను రాజేసింది.
బైక్‌పై వచ్చిన ఇద్దరు అంగతకులు బస్సును అటకాయించి, డ్రైవర్ పై కాల్పులు జరిపారు. అనంతరం ఒక నర్సరీ విద్యార్థిని బలవంతంగా ఎత్తుకొని పారిపోయారు. బాధిత బాలుడిని వివేకానంద పాఠశాలలో చదువుతున్న నర్సరీ విద్యార్థిగా గుర్తించారు. ఈ షాకింగ్ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు బుధవారం సాయంత్రం గుర్గావ్‌లో స్కూలు బస్సుపై దాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీలో ఈ రోజు చాలా స్కూళ్లను మూసివేశారు.
Comments
Please login to add a commentAdd a comment