బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు | BJP MLA shot at Jaipur | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు

Published Fri, Aug 28 2015 6:19 PM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM

రాజస్థాన్లో ఓ బీజేపీ ఎమ్మల్యేపై కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆయన అప్రమత్తమవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

జైపూర్: రాజస్థాన్లో ఓ బీజేపీ ఎమ్మల్యేపై కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆయన అప్రమత్తమవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దౌసాలోని మహ్వా నియోజవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఓంప్రకాశ్ హుడ్లా ఏవో పనుల్లో తన ఇంట్లో ఉండగా ఓ ముగ్గురు వ్యక్తులు ఇంటి ప్రాంగణంలోకి చొరబడి కిటికిలో నుంచి కాల్పులు జరిపారు.

అయితే, అదృష్టవశాత్తూ ఆయనకు ఒక్క బుల్లెట్ కూడా తగలలేదు. ఆయన వెంటనే అలారం మోగించడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement