జర్నలిస్టు పై మరోదాడి | Another UP Journalist shot at for allegedly complaining against local gambling dens | Sakshi
Sakshi News home page

జర్నలిస్టు పై మరోదాడి

Published Thu, Jun 11 2015 11:45 AM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM

Another UP Journalist shot at for allegedly complaining against local gambling dens

కాన్పూర్: మొన్న మైనింగ్ మాఫియా ఓ జర్నలిస్ట్ని సజీవదహనం చేస్తే..నేడు పేకాట ముఠా మరో జర్నలిస్ట్ పై కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది. పేకాట స్థావరాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు దీపక్ మిశ్రా అనే జర్నలిస్ట్ని దుండగులు గన్తో కాల్చారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లోని కాన్పూర్ జిల్లా షాజహాన్పూర్లో చోటుచేసుకుంది. తీవ్రగాయాలయతో కొట్టుమిట్టాడుతున్న దీపక్ మిశ్రాని ఆస్పత్రిలో చేర్పించారు.


కాగా, ఉత్తర్ ప్రదేశ్లో మైనింగ్ అక్రమాలకు వ్యతిరేకంగా ఫేస్ బుక్లో పోస్ట్ చేసినందుకు జగేంద్ర అనే జర్నలిస్టును సజీవ దహనం చేశారు. ఈ సంఘటనలో పోలీసులు మంత్రి రామ్మూర్తి సింగ్, ఇన్ స్పెక్టర్ శ్రీ ప్రకాశ్ రాయ్ తోపాటు నలుగురు వ్యక్తులపై కేసు నమోదైన విషయం తెసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement