gambling dens
-
జర్నలిస్టు పై మరోదాడి
కాన్పూర్: మొన్న మైనింగ్ మాఫియా ఓ జర్నలిస్ట్‌ని సజీవదహనం చేస్తే..నేడు పేకాట ముఠా మరో జర్నలిస్ట్ పై కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది. పేకాట స్థావరాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు దీపక్ మిశ్రా అనే జర్నలిస్ట్‌ని దుండగులు గన్‌తో కాల్చారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా షాజహాన్పూర్లో చోటుచేసుకుంది. తీవ్రగాయాలయతో కొట్టుమిట్టాడుతున్న దీపక్ మిశ్రాని ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, ఉత్తర్ ప్రదేశ్‌లో మైనింగ్ అక్రమాలకు వ్యతిరేకంగా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసినందుకు జగేంద్ర అనే జర్నలిస్టును సజీవ దహనం చేశారు. ఈ సంఘటనలో పోలీసులు మంత్రి రామ్మూర్తి సింగ్, ఇన్ స్పెక్టర్ శ్రీ ప్రకాశ్ రాయ్ తోపాటు నలుగురు వ్యక్తులపై కేసు నమోదైన విషయం తెసిందే. -
తమిళనాడు నుంచి గుంటూరుకు పందెంకోళ్లు
హైదరాబాద్ : సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందేలకు వెళుతున్న పందెంరాయుళ్లను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే పోలీసుల హెచ్చరికలు ‘మామూలే’నంటూ పందెం రాయుళ్లు పందేలకు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. పందాలను జరగనిచ్చేది లేదంటూ పోలీసులు ఇప్పటికే ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల హెచ్చరికలు ‘మామూలే’నంటూ వాటిని పందెంరాయుళ్లు బేఖాతరు చేస్తున్నారు. కాగా తమిళనాడు నుంచి గుంటూరు జిల్లాలకు కోడి పందెలకు వస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు మంగళగిరి మండలం నూతక్కి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు చెక్‌పోస్ట్ వద్ద ఏడుగురు పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక కృష్ణాజిల్లా కైకలూరులో కోడి పందెలా శిబిరాలపై జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 23మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 19 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారివద్ద నుంచి 4.3 లక్షలు సీజ్ చేశారు. కాగా పోలీసుల రాకతో పలువురు పందెం రాయుళ్లు కాళ్లకు పని చెప్పారు. దాంతో వారి కోసం గాలిస్తున్నారు.