హైదరాబాద్ : సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందేలకు వెళుతున్న పందెంరాయుళ్లను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే పోలీసుల హెచ్చరికలు ‘మామూలే’నంటూ పందెం రాయుళ్లు పందేలకు పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. పందాలను జరగనిచ్చేది లేదంటూ పోలీసులు ఇప్పటికే ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల హెచ్చరికలు ‘మామూలే’నంటూ వాటిని పందెంరాయుళ్లు బేఖాతరు చేస్తున్నారు.
కాగా తమిళనాడు నుంచి గుంటూరు జిల్లాలకు కోడి పందెలకు వస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు మంగళగిరి మండలం నూతక్కి వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు, కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు చెక్పోస్ట్ వద్ద ఏడుగురు పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఇక కృష్ణాజిల్లా కైకలూరులో కోడి పందెలా శిబిరాలపై జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 23మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 19 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారివద్ద నుంచి 4.3 లక్షలు సీజ్ చేశారు. కాగా పోలీసుల రాకతో పలువురు పందెం రాయుళ్లు కాళ్లకు పని చెప్పారు. దాంతో వారి కోసం గాలిస్తున్నారు.
తమిళనాడు నుంచి గుంటూరుకు పందెంకోళ్లు
Published Mon, Jan 13 2014 9:20 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
Advertisement
Advertisement