ముంబై: మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సదరు శివసేన నేత తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. కొద్దికాలంగా ఓ స్థలం వివాదానికి సంబంధించి శివసేన నేత మహేశ్ గైక్వాడ్, బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్‌లతో పాటు వారి మద్దతుదారులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో గణ్‌పత్ గైక్వాడ్.. మహేశ్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మహేశ్ తీవ్రంగా గాయపడ్డారు.
#WATCH | Thane, Maharashtra: Sudhakar Pathare, DCP says, "Mahesh Gaikwad and Ganpat Gaikwad had differences about something and they came to the Police station to give complaint. At that time, they had a talk and Ganpat Gaikwad fired at Mahesh Gaikwad and his people. 2 people… pic.twitter.com/Qw2Q9iUHHz
— ANI (@ANI) February 2, 2024
ఇక, కాల్పుల్లో శివసేన ఎమ్మెల్యే రాహుల్ పాటిల్ కూడా గాయపడ్డారు. తక్షణమే స్పందించిన పోలీసులు నేతలిద్దరినీ థానేలోని జూపిటర్ హాస్పిటల్‌కు తరలించారు. గణ్‌పత్ గైక్వాడ్‌ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అతడు ఉపయోగించిన తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శివసేన మద్దతుదారులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment