'రాహుల్ ను ఉరి తీయాలి, లేదా కాల్చి చంపాలి' | Rajasthan BJP MLA: ‘Traitor’ Rahul Gandhi should be hanged or shot | Sakshi
Sakshi News home page

'రాహుల్ ను ఉరి తీయాలి, లేదా కాల్చి చంపాలి'

Published Thu, Feb 18 2016 12:51 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

'రాహుల్ ను ఉరి తీయాలి, లేదా కాల్చి చంపాలి' - Sakshi

'రాహుల్ ను ఉరి తీయాలి, లేదా కాల్చి చంపాలి'

జైపూర్: జేఎన్యూ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఈ వివాదం నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్  ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ  ప్రయత్నిస్తోంది.  తాజాగా రాజస్థాన్  బీజేపీ ఎమ్మెల్యే కైలాశ్ చౌదరి... రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జెఎన్యూలో దేశద్రోహులకు మద్దతు పలుకుతున్న రాహుల్  ఒక విద్రోహి అని వ్యాఖ్యానించారు. రాహుల్ ను  ఉరి తీయాలి లేదంటే..కాల్చి చంపాలంటూ మండిపడ్డారు.  బైతూ అసెంబ్లీ నియోజవర్గ ఎమ్మెల్యే కైలాశ్ బుధవారం మీడియాతో మాట్లాడారు.

 

ఈ సందర్భంగా ఆయన  ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది.  అఫ్జల్ గురుని దేశభక్తుడిగా కీర్తిస్తూ, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ద్రోహులను సమర్ధించిన రాహుల్ దేశంలో  వుండే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. కాగా  జేఎన్యూ విద్యార్ధులకు మద్దతు పలికిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా రాజద్రోహం కేసు నమోదు చేయాలన్న ఓ న్యాయవాది పిటిషన్ ను అలహాబాద్  విచారణకు స్వీకరించడం గమనార్హం. ఈ వ్యవహారంలో చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement