
అహ్మదాబాద్: కరోనా ఎఫెక్ట్‌తో గుజరాత్ హైకోర్టు మూతపడింది. కోర్టులో పనిచేసే ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కోర్టు ఆవరణను శానిటైజ్ చేసేందుకు బుధవారం నుంచి శుక్రవారం వరకు కోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు సర్క్యులర్ జారీ చేశారు.
కాగా.. ఈ మూడు రోజుల్లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జ్యూడిషియల్ అకాడమీ, ఆడిటోరియంతో పాటు చాంబర్లు, కార్యాలయాలు, రికార్డ్ రూమ్‌లు అన్నీ శుభ్రం చేయనున్నట్లు తెలిపారు. అప్పటి వరకు హైకోర్ట్ న్యాయవాదుల విధులను సస్పెండ్ చేస్తున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
చదవండి: కరోనా: పరిస్థితులు చేజారిపోయాయా..!
Comments
Please login to add a commentAdd a comment