గుజరాత్ అల్లర్లు.. ప్రభుత్వానికి ఊరట
గుజరాత్ అల్లర్లు.. ప్రభుత్వానికి ఊరట
Published Tue, Aug 29 2017 11:22 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మత ఘర్షణల్లో ధ్వంసమైన 500 మత కట్టడాలను తిరిగి నిర్మించే బాధ్యత ప్రభుత్వానిదేనని అహ్మదాబాద్ హైకోర్టు గతంలో తీర్పు వెలువరించింది. తీర్పును సవాల్ చేస్తూ గుజరాత్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అల్లర్లలో ధ్వంసమైన పలు దుకాణ సముదాయాలకు, కట్టడాలకు, ఇళ్లకు ఇప్పటికే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, పీసీ పంత్ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలతో ఏకీభవిస్తూ మసీదులను పునఃనిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదంటూ తేల్చేసింది.
గుజరాత్ అల్లర్ల సమయంలో నరోదా గామ్ నర మేథం(11 మంది హత్య కేసు)కు సంబంధించి నాలుగు నెలల్లో తీర్పు వెలువరించాలంటూ దిగువ న్యాయస్థానికి సుప్రీంకోర్టు ఈ మధ్యే ఆదేశాలు జారీ చేసింది. గోద్రా ఘటన తర్వాత జరిగిన గుజరాత్ లో చెలరేగిన అల్లర్లలో సుమారు 2000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement