గుజరాత్ అల్లర్ల కేసులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మాజీ మంత్రి మాయా కొద్నానీ నిర్దోషిగా విడుదల అయ్యారు. 2002 గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో అహ్మదాబాద్‌లోని నరోదా పటియాలో నరమేథం జరిగింది. ఈ నరమేథం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాయా కొద్నానీని శుక్రవారం గుజరాత్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సంశయ లాభం కింద కొద్నానీని నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.