రూ.50 కేసు 28 ఏళ్లకు తేలింది!
రూ.50 కేసు 28 ఏళ్లకు తేలింది!
Published Sun, Oct 30 2016 11:19 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM
అహ్మదాబాద్ : ఓ వ్యక్తికి తన అపరాధం ఒప్పుకోవడానికి దాదాపు 28 ఏళ్లు పట్టింది. సురేంద్రనగర్కు చెందిన మన్షుక్లాల్ దేవ్రాజ్ అనేవ్యక్తి 1988లో ఓ పేద కుటుంబం నుంచి రూ.50 లంచం తీసుకున్నాడు. అది ఒప్పుకోవడానికి మాత్రం తటపటాయించాడు. ఒకటా రెండా ఏకంగా 28 ఏళ్ల దాకా సతాయించాడు. చివరికి గుజరాత్ కోర్టులో తన తప్పును ఒప్పుకున్నాడు. అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం దేవరాజ్కి ఆరు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. ఇదే కేసులో దేవరాజ్ సీనియర్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్స్పెక్టర్ భాంజీభాయ్ గోవాభాయ్ కూడా నిందితుడే. అయితే అతను మరణించడంతో భాంజీభాయ్పై ఫిర్యాదును హైకోర్టు పక్కనపెట్టింది. 25 ఏళ్ల తర్వాత దేవ్రాజ్ అప్పీల్ను విచారించింది.
హైకోర్టులో ఈ కేసు డాక్యుమెంట్లు లేకపోవడంతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న పేపర్బుక్ రికార్డుల బట్టి ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతి వారికి సబ్సిడీ కింద రుణాలు ఇప్పించడాన్ని ఓ సంస్థకు బాధ్యతలు అప్పటించారు. ఆ సంస్థ తరుఫున దేవ్రాజ్ టీమ్ క్రెడిట్ కార్యకలాపాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి బాధ్యత వహిస్తున్నారు. ఓ చిన్న వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకున్న ఓ పేద కుటుంబానికి రుణాన్ని పెంచడానికి దేవ్రాజ్ రూ.50 డిమాండ్ చేశాడు.
ఈ విషయాన్ని ఆ కుటుంబం అవినీతి నిరోధక బ్యూరోలో తెలపడంతో దేవ్రాజ్పై కేసు నమోదైంది. దేవ్రాజ్ను నిర్దోషిగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయ్యారని జస్టిస్ ఎస్జీ షా తెలిపారు. ప్రాసిక్యూషన్ మూడు కోర్టులోనూ దేవ్రాజ్ లంచం డిమాండ్ చేయలేదని నిరూపించలేకపోయారు. కానీ లంచానికి అడిగినమొత్తాన్ని అడ్డం పెట్టుకుని దేవ్రాజ్ న్యాయవాది ఈ కేసుపై పోరాటం చేశారు. కానీ వారి ఆలోచనలకు బిన్నంగా కోర్టు అవినీతి కేసులో శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది.
Advertisement
Advertisement