bribery charge
-
కేంద్రానికి రాజస్థాన్ సర్కార్ షాక్!.. ఇద్దరు ఈడీ అధికారుల అరెస్టు
జైపూర్: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరు నడుస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల మీద ఈడీ దాడులు జరుపుతుండగా.. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు కూడా కేంద్రధీటుగా బదులిస్తున్నాయి. తాజాగా కేసు నమోదు వ్యవహారంలో ఇద్దరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లంచం తీసుకుంటుండగా రాష్ట్ర ఏసీబీ (అవినీతి వ్యతిరేక సంస్థ) అధికారులు అరెస్టు చేశారు. ఓ చిట్ ఫండ్‌కు సంబంధించిన ఓ వ్యవహారంలో కేసు నమోదు చేయకుండా ఇద్దరు ఈడీ అధికారులు రూ.15 లక్షల లంచం తీసుకున్నారని ఏసీబీ అధికారులు ఆరోపించారు. వీరిద్దరూ ఆధారాలతో సహా పట్టుబడ్డారని తెలిపారు. విదేశీ మారక నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్‌ను ఈడీ అక్టోబర్ 30న తొమ్మిది గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించింది. రాజకీయ కక్షతోనే కేంద్రం ఈడీ దాడులు జరిపిస్తోందని ఆరోపించింది. బీజేపీ హయాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు విశ్వాసాన్ని కోల్పోయాయని సీఎం గహ్లోత్ అన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఈడీ అధికారులను అరెస్టు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. Rajasthan ACB has arrested an ED official for taking a bribe of ₹15 lakhs. Modi thought he could scare Ashok Gehlot and Congress…😀 pic.twitter.com/AT9ZAyONF3 — Shantanu (@shaandelhite) November 2, 2023 రాజస్థాన్‌లో నవంబర్ 25న ఎన్నికల జరగనున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ.. మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని దూకుడుగా ఉంది. అటు.. ఈసారి తప్పకుండా అధికారం తమదేనని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అటు ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే.. నేడు ఈడీ అధికారుల ముందు ఆయన హాజరుకావాల్సి ఉంది. కానీ ఈడీ సమన్లను వెనక్కి తీసుకోవాలని ప్రత్యుత్తరం రాస్తూ ఈడీ ముందు హాజరుకాలేదు. ఇదీ చదవండి: మూడు బ్యాగులతో ఎథిక్స్ కమిటీ ముందు హాజరైన మహువా మెయిత్రా -
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సచిన్ పైలట్ నోటీసు
జైపూర్ : బీజేపీలో చేరితే తనకు 35 కోట్ల రూపాయలు అందచేస్తానని ప్రలోభాలకు గురిచేశారని తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగకు రెబెల్ నేత షాక్ ఇచ్చారు. తనపై ముడుపుల ఆరోపణలు చేసిన గిరిరాజ్ సింగ్‌కు పైలట్ బుధవారం లీగల్ నోటీసులు పంపారు. తమ నేతపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిన గిరిరాజ్ సింగ్‌కు నోటీసులు జారీ చేశారని పైలట్ వర్గీయులు నిర్ధారించారు. కాగా పైలట్ తనతో సంప్రదింపులు జరుపుతూ పార్టీ మారేందుకు మీకు ఎంత మొత్తం కావాలని అడిగారని, 35 కోట్ల రూపాయలు అందిస్తామని చెప్పారని గిరిరాజ్ సింగ్ మంగళవారం తిరుగుబాటునేతపై ఆరోపణలు గుప్పించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి బేరసారాలు సాగుతున్నాయని..తాను ఇలాంటి పనికి పాల్పడలేనని వారికి చెప్పానని..రెండు మూడు సార్లు పైలట్‌తోనూ మాట్లాడానని కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. గిరిరాజ్ సింగ్ మలింగ ఆరోపణలను సచిన్ పైలట్ తోసిపుచ్చారు. ఇవి నిరాధార ఆరోపణలని, తన ప్రతిష్టను మసకబార్చేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రితో పాటు, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ పదవుల నుంచి కాంగ్రెస్ తొలగించింది. మరోవైపు పైలట్ సహా 18 మంది ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుల వ్యవహారంపై ప్రస్తుతం న్యాయస్ధానంలో విచారణ జరుగుతోంది. కాగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పైలట్ బీజేపీతో కలిసి కుట్రపన్నారని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపిస్తుండగా బీజేపీతో కలిసేదిలేదని పైలట్ స్పష్టం చేస్తున్నారు. చదవండి : సచిన్ పైలట్ వర్గానికి 24 వరకు ఊరట -
రూ.50 కేసు 28 ఏళ్లకు తేలింది!
అహ్మదాబాద్ : ఓ వ్యక్తికి తన అపరాధం ఒప్పుకోవడానికి దాదాపు 28 ఏళ్లు పట్టింది. సురేంద్రనగర్‌కు చెందిన మన్షుక్లాల్ దేవ్‌రాజ్ అనేవ్యక్తి 1988లో ఓ పేద కుటుంబం నుంచి రూ.50 లంచం తీసుకున్నాడు. అది ఒప్పుకోవడానికి మాత్రం తటపటాయించాడు. ఒకటా రెండా ఏకంగా 28 ఏళ్ల దాకా సతాయించాడు. చివరికి గుజరాత్ కోర్టులో తన తప్పును ఒప్పుకున్నాడు. అవినీతి నిరోధక ప్రత్యేక న్యాయస్థానం దేవరాజ్‌కి ఆరు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. ఇదే కేసులో దేవరాజ్ సీనియర్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్స్పెక్టర్ భాంజీభాయ్ గోవాభాయ్ కూడా నిందితుడే. అయితే అతను మరణించడంతో భాంజీభాయ్పై ఫిర్యాదును హైకోర్టు పక్కనపెట్టింది. 25 ఏళ్ల తర్వాత దేవ్‌రాజ్ అప్పీల్‌ను విచారించింది. హైకోర్టులో ఈ కేసు డాక్యుమెంట్లు లేకపోవడంతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న పేపర్‌బుక్ రికార్డుల బట్టి ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతి వారికి సబ్సిడీ కింద రుణాలు ఇప్పించడాన్ని ఓ సంస్థకు బాధ్యతలు అప్పటించారు. ఆ సంస్థ తరుఫున దేవ్‌రాజ్ టీమ్ క్రెడిట్ కార్యకలాపాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి బాధ్యత వహిస్తున్నారు. ఓ చిన్న వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకున్న ఓ పేద కుటుంబానికి రుణాన్ని పెంచడానికి దేవ్‌రాజ్ రూ.50 డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఆ కుటుంబం అవినీతి నిరోధక బ్యూరోలో తెలపడంతో దేవ్రాజ్పై కేసు నమోదైంది. దేవ్‌రాజ్‌ను నిర్దోషిగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయ్యారని జస్టిస్ ఎస్జీ షా తెలిపారు. ప్రాసిక్యూషన్ మూడు కోర్టులోనూ దేవ్‌రాజ్ లంచం డిమాండ్ చేయలేదని నిరూపించలేకపోయారు. కానీ లంచానికి అడిగినమొత్తాన్ని అడ్డం పెట్టుకుని దేవ్‌రాజ్ న్యాయవాది ఈ కేసుపై పోరాటం చేశారు. కానీ వారి ఆలోచనలకు బిన్నంగా కోర్టు అవినీతి కేసులో శిక్ష విధిస్తూ తీర్పుచెప్పింది.