డెలివరీ కోసం మహిళకు 11నెలలు బెయిల్ | Pregnant woman granted 11-month bail for delivery | Sakshi
Sakshi News home page

డెలివరీ కోసం మహిళకు 11నెలలు బెయిల్

Published Thu, Feb 4 2016 11:40 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

డెలివరీ కోసం మహిళకు 11నెలలు బెయిల్

డెలివరీ కోసం మహిళకు 11నెలలు బెయిల్

అహ్మదాబాద్:  గుజరాత్ హైకోర్టు మానవతా దృక్పథంతో ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న మహిళకు.. డెలివరీ కోసం బెయిల్ మంజూరు చేసింది. వరకట్న వేధింపుల కోసులో శిక్ష అనుభవిస్తున్న అయిదు నెలల గర్భిణికి న్యాయస్థానం  11 నెలల పాటు బెయిల్ ఇచ్చింది.  అన్న భార్యను  ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో దోషిగా  తేలిన భావనా ప్రజాపతి(30) అనే మహిళకు  ప్రసవించేందుకు కోర్టు ఈ వెసులుబాటును కల్పించింది.  ప్రసవం అనంతరం బిడ్డతో సహా  ఈ ఏడాది  డిసెంబర్ 31న  కోర్టుకు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  

పదివేల రూపాయల  పూచీకత్తుతో ఈ బెయిల్ మంజూరు చేసింది. మానవతా దృక్పథంతో శిక్షా కాలాన్ని తగ్గించాల్సిందిగా భావన పెట్టుకున్న పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.  జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ కె సయీద్లతో కూడిన ఇద్దరు  న్యాయమూర్తుల ధర్మాసనం భావనా ప్రజాపతికి  మంజూరు చేసింది.  దీంతోపాటుగా  జైలుకి తిరిగి వచ్చిన అనంతరం రెండేళ్ల కుమార్తె సహా, నవజాత శిశువు ఉండేందుకు వీలుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని  జైలు అధికారులకు  సూచించింది.  అటు కోర్టు నిర్ణయంపై భావన హర్షం వ్యక్తం చేసింది. అయితే తప్పు ఏమీ లేకపోయినా తన బిడ్డలు శిక్ష అనుభవించడం బాధ  కలిగిస్తోందని వాపోయింది.

ఇక కేసు  పూర్వపరాల్లోకి వెళితే... భావన  సోదరుడు భార్య జల్పా ప్రజాపతి ఆత్మహత్య కేసులో భావనతో పాటు తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులను  దోషులుగా  తేల్చిన సెషన్స్ కోర్టు  ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో హైకోర్టులో అప్పీల్ చేశారు. అదనపు కట్నం కోసం కుటుంబం తీవ్రంగా హింసించడం మూలంగానే ఆమె ఆత్యహత్య చేసుకుందన్న కిందికోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement