human mistakes
-
Gujarat High Court: మానవ తప్పిద మహావిషాదం
అహ్మదాబాద్: రాజ్‌కోట్‌లో గేమ్‌జోన్‌లో అగి్నప్రమాద ఘటనపై గుజరాత్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మానవ తప్పిద మహా విషాదంగా అభివరి్ణంచింది. ఘటనను సూమోటోగా స్వీకరించిన జస్టిస్ బీరెన్ వైష్ణవ్, జస్టిస్ దేవాన్ దేశాయ్‌ల హైకోర్టు ధర్మాసనం ఈ కేసును ఆదివారం విచారించింది. ‘‘ ప్రాథమిక ఆధారాలను చూస్తే ఇది మానవతప్పిదమే స్పష్టంగా తెలుస్తోంది. ఏ చట్టనిబంధనల కింద ఇలాంటి గేమింగ్ జోన్లు, రీక్రియేషనల్ కేంద్రాలను ఏర్పాటుచేశారు?’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ గుజరాత్ కాంప్రిహేన్సివ్ జనరల్ డెవలప్మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్స్(జీడీసీఆర్) నిబంధనల్లో ఉన్న లొసుగులను తెలివిగా వాడుకున్నట్లు తెలుస్తోంది. గేమింగ్ జోన్లు రాజ్కోట్తోపాటు అహ్మదాబాద్, వడోదర, సూరత్‌లలో ఉండటంతో ఆయా నగర మున్సిపల్ కార్పొరేషన్ల తరఫు అడ్వకేట్లు అందర్నీ సోమవారం తమ ఎదుట హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ‘‘ నిరభ్యంతర సరి్టఫికెట్, నిర్మాణ అనుమతులు వంటి వాటి నుంచి తప్పించుకునేందుకు టీఆర్పీ గేమ్‌జోన్ నిర్వాహకులు ఏదో తాత్కాలిక ఏర్పాట్లుచేసి చేతులు దులుపుకుని చిన్నారులు రక్షణను గాలికొదిలేశారు. గేమ్‌జోన్‌లో అనుమతి లేని, మండే స్వభావమున్న పెట్రోల్, ఫైబర్, ఫైబర్ గ్లాస్ïÙట్లను భద్రపరిచిన చోటులోనే అగి్నప్రమాదం జరిగింది’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 15మంది జాడ గల్లంతు ఆదివారం నాటికి మృతుల సంఖ్య 33కు పెరిగింది. మరో 15 మందికిపైగా జనం జాడ తెలీడం లేదని అధికారులు వెల్లడించారు. నానామావా రోడ్‌లోని ఘటనాస్థలిని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదివారం సందర్శించారు. తర్వాత క్షతగాత్రు లను ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. ‘ ఘటన కారకులందరినీ ఉరితీయాలి. ఏ ఒక్కరికీ బెయిల్ కూడా దొరకొద్దు. బెయిల్ ఇస్తే వారిని నేనే చంపేస్తా’ అని ఏకైక కుమారుడు, నలుగురు బంధువులను పోగొట్టుకున్న ప్రదీప్‌సిన్హ్ చౌహాన్ ఆవేశంగా చెప్పారు. ఇటీవల నిశి్చతార్థమైన ఒక జంట సైతం ప్రమాదంలో అగి్నకి ఆహుతైంది. గేమ్‌జోన్ ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్‌కు ఎలాంటి ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికెట్ లేదని ఎఫ్ఐఆర్లో రాసి ఉంది. -
నేడు పట్టాలపైకి డ్రైవర్ రహిత తొలి ట్రైన్
సాక్షి, న్యూఢిల్లీ: మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసు తొలిసారిగా మన దేశంలో పట్టాలెక్కనుంది. ఈ రైలు సర్వీసును ప్రధాని మోదీ 28న ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ మెట్రోలోని మెజెంటా లైన్ (జనక్‌పురి వెస్ట్ –బొటానికల్ గార్డెన్) లో డ్రైవర్ రహిత సర్వీసుకు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. దీనితోపాటు ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్లో పూర్తిస్థాయిలో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ సేవను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభిస్తారు. ఈ ఆవిష్కరణలు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడంతో పాటు, రవాణా రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని అధికారులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 7 శాతం డ్రైవర్‌లెస్ మెట్రో రైల్ నెట్వర్క్ జాబితాలో ఢిల్లీ కూడా చేరుతుందన్నారు. సోమవారం మెజెంటా లైన్లో డ్రైవర్‌లెస్ సర్వీసులు ప్రారంభమైన తరువాత, 2021 మధ్య నాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్ లైన్లో డ్రైవర్‌లెస్ ట్రైన్ సర్వీసులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. -
కరోనా వైరస్ మానవ తప్పిదమే!
న్యూఢిల్లీ : వివిధ రకాల వైరస్ల వల్ల సంక్రమిస్తోన్న వ్యాధులను ఆంగ్లంలో ‘జూనాటిక్ డిసీసెస్’ లేదా ‘జూనోసెస్’ అని అంటారు. అంటే జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులని అర్థం. మానవులకు సంక్రమించే వ్యాధుల్లో 75 శాతం అంటువ్యాధులు కాగా, వాటిలో 60 శాతం జంతువుల నుంచి సంక్రమిస్తున్నవే. నేడు ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కోవిడ్ వైరస్ కూడా ఆ కోవకు చెందినదే. సార్స్ (సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) పునుగు పిల్లుల నుంచి రాగా, మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్), ఒంటెల వల్ల రాగా, ఎబోలా, బర్డ్ ఫ్లూలు ఇతర జంతువుల నుంచి వచ్చాయి. (పారాసిటమాల్ మింగి.. దర్జాగా ఇంటికి..!) వ్యవసాయ విస్తరణ లేదా పట్టణీకరణ లేదా మరే ఇతర కారణాల వల్ల జంతువులు, ఇతర వన్య ప్రాణులు జీవించే అడువులను నరికి వేయడం వల్ల జంతువుల ఆరోగ్యం క్షీణించి వైరస్ల బారిన పడుతున్నాయి. వాటిలో బలిష్టంగా రూపాంతరం చెంతుతోన్న పలు రకాల వైరస్లు వాటి నుంచి మనుషులకు సోకుతున్నాయి. అడవులను నరికివేయడం వల్ల పర్యావరణ పరిస్థితులు దెబ్బతినడంతోపాటు ఇలాంటి అనర్థాలు సంభవిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం విభాగం 2016లోనే ఓ నివేదికలో హెచ్చరించింది. (కరోనా: కృత్రిమంగా తయారు చేసింది కాదు!) ఒక్క 2018లోనే చెట్లు నరికివేయడం వల్ల, కార్చిచ్చుల వల్ల 1.20 కోట్ల హెక్టార్ల అడవులు నశించాయని, బ్రెజిల్, ఇండోనేసియా, మలేసియా దేశాల్లో ఎక్కువ అడవులు నశించాయని ‘గ్లోబల్ వారెస్ట్ వాచ్’ ఓ నివేదికలో వెల్లడించింది. పట్టణీకరణలో భాగంగా అతి తక్కువ స్థలంలో జన సాంద్రత ఎక్కువగా ఉండడం, సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒకరికి సోకిన వైరస్ ఇతరులకు వేగంగా వ్యాపిస్తోందని ఆ నివేదికలో ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. పర్యావరణ ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే ప్రపంచ మానవాళి మనుగడ బాగుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఆహార, వ్యవసాయ సంస్థ పిలుపునివ్వగా, ‘జంతువులు, అడవుల ఆరోగ్యంపైనే మానవులు ఆరోగ్యం ఆధారపడి ఉంది’ అని ‘ది సెంటర్ ఫర్ పీపుల్ అండ్ ఫారెస్ట్స్ ఇన్ బ్యాంగ్కాగ్’ ఎగ్సిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ గ్యాంగ్ వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా వైరస్ల విజృంభణకు మానవ తప్పిదనమని స్పష్టం అవుతోంది. (ప్రపంచ దేశాల్లో ప్రజా దిగ్భందనం) -
మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు
– ప్రమాదాల నియంత్రణకు పరిజ్ఞానం పెంచుకోవాలి – రోడ్డు భధ్రతా వారోత్సవాల్లో వక్తలు అనంతపురం సిటీ : రోడ్డు ప్రమాదాలు కేవలం మానవ తప్పిదాలతోనే అధికంగా జరుగుతున్నాయని వక్తలు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌లో ‘రహదారులు–భవనాలశాఖ’ ఆధ్వర్యంలో ‘రోడ్డు భధ్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్అండ్బీ ఎస్ఈ సుబ్రమణ్యం అధ్యక్షత వహించగా, ముఖ్య అథితులుగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, జేఎన్టీయూ మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ హేమచంద్ర, పలువురు ఇంజినీర్లు హాజరయ్యారు. ఈసందర్భంగా జేసీ లక్ష్మీకాంతం, జేఎన్టీయూ ఫ్రొఫెసర్ హేమచంద్ర తదితరులు మాట్లాడుతూ దేశం ఇప్పుడిప్పుడే పురోగతి సాధిస్తోందన్నారు. ఇక్కడున్న రోడ్లు, ఫుట్‌పాత్‌లతోపాటు సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ప్రయాణాలు సాగించాలన్నారు. వేగం ఎంత ప్రమాదమో తెలుసుకోవాలన్నారు. వంద ప్రమాదాలు జరిగితే వాటిలో 98 ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయన్నారు. కేవలం మానవ తప్పిదాల కారణంగా చాలా మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ తప్పిదాలను నియంత్రించాలంటే ప్రత్యేక చట్టాలు, హెచ్చరికలు, సూచనలు ఎన్ని ఉన్నా...ప్రతి మనిషిలో ప్రమాదాల నియంత్రణ పట్ల పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే చాలన్నారు. గమ్యాన్ని చేరాలంటే వేగం ఒక్కటే సరిపోదన్నారు. అనంతరం రోడ్లు భవణాల శాఖలో ప్రమాదాల నియంత్రణపై ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ఉద్యోగులకు అధికారులు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి ముందుగా ఆర్అండ్బీ కార్యాలయం నుంచి స్థానిక సఫ్తగిరి సర్కిల్ దాకా ఇంజనీరింగ్ విద్యార్థినీ, విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆ శాఖ అధికారులు, కళా బృందం సభ్యులు పాల్గొన్నారు. కళా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతాలో పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.