
కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ మరోసారి సంచలనానికి తెరతీసింది. తన సర్వీస్ పోర్టిఫోలియోను మరింత విస్తరించుకుంది. అంచనాల కనుగుణంగానే గేమింగ్, న్యూస్, టీవీ సబ్‌స్క్రిప్షన్ సర్వీసుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. యాపిల్ టీవీ ప్లస్, కొత్త యాపిల్ టీవీ యాప్, టీవీ ఛానల్స్‌ను కాలిఫోర్నియాలో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఆవిష్కరించింది. అంతేకాదు త్వరలోనే యాపిల్ క్రెడిట్ కార్డులు కూడా తీసుకు వస్తామని ప్రకటించింది.
ప్రధానంగా యాపిల్ ఆర్కేడ్ పేరుతో వీడియో గేమ్ సర్వీసులను ఆవిష్కరించింది. సబ్‌స్క్రిప్షన్ ద్వారా పనిచేసే ప్రపంచంలోనే తొలి గేమింగ్ సర్వీసని యాపిల్ ప్రకటించింది. 100కుపైగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇవ్వన్నీ కేవలం యాపిల్ డివైస్‌లకు మాత్రమే ప్రత్యేకం.



Comments
Please login to add a commentAdd a comment