సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఓ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ కోసం ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశాడు. ‘స్వైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్’యాప్‌లో నా కుమార్తె గేమ్ ఆడుతుంది. ఈ గేమ్ ద్వారా రోజుకు 2100 డాలర్లు సంపాదిస్తోంది. చాలా మంది ఈ యాప్ ద్వారా గేమ్ ఆడి డబ్బు సంపాదిస్తున్నారు’అంటూ ఓ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
దీనిపై సచిన్ టెండూల్కర్ సోమవారం స్పందించారు. డీప్ ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాల నుంచి సత్వర చర్యలు చాలా కీలకం’అంటూ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌లతో పాటు మహారాష్ట్ర సైబర్ క్రైంలకు ఆయన ట్యాగ్ చేశారు. సచిన్ ట్వీట్‌పై మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఏఐ, డీప్ ఫేక్ వంటి వాటి నుంచి ప్రజలకు రక్షణ కలి్పంచేందుకు త్వరలోనే పటిష్టమైన ఐటీ చట్టాలను అమల్లోకి తీసుకోస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment