హోంమంత్రిని కలిసిన ఎన్టీపీసీ గుర్తింపు సంఘం నాయకులు | meet the home minister | Sakshi
Sakshi News home page

హోంమంత్రిని కలిసిన ఎన్టీపీసీ గుర్తింపు సంఘం నాయకులు

Sep 24 2016 5:57 PM | Updated on Sep 4 2017 2:48 PM

జ్యోతినగర్‌ : రాష్ట్ర హోంమంత్రి, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాయిని నర్సింహరెడ్డిని ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 13న ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికలలో హెచ్‌ఎంఎస్‌ అనుబంధ ఎన్టీపీసీ డెమోక్రటిక్‌ ఎంప్లాÄæూస్‌ యూనియన్‌ బ్యానర్‌పై ఐక్య కూటమిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం విదితమే.

జ్యోతినగర్‌ : రాష్ట్ర హోంమంత్రి, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నాయిని నర్సింహరెడ్డిని ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 13న ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికలలో హెచ్‌ఎంఎస్‌ అనుబంధ ఎన్టీపీసీ డెమోక్రటిక్‌ ఎంప్లాÄæూస్‌ యూనియన్‌ బ్యానర్‌పై ఐక్య కూటమిగా పోటీ చేసి విజయం సాధించిన విషయం విదితమే. ఎన్నికలలో హోంమంత్రి రామగుండంలో ప్రచార సభలో పాల్గొని విజయంలో కీలకపాత్ర పోషించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐక్య కూటమి నాయకులు సీహెచ్‌.ఉపేందర్, అశోక్, గోపాల్‌రెడ్డి, కోట మల్లేశ్, సత్యనారాయణరెడ్డి, ఆరెల్లి సత్యనారాయణ గౌడ్, ఉదయ్‌కుమార్, సాగి కిషన్‌రావు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement