- నోటీస్ ఉపసంహరించుకున్న ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ
సమ్మెకు ఎన్టీపీసీ ఉద్యోగులు దూరం
Published Thu, Sep 1 2016 8:35 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం సంస్థ ఉద్యోగులు సార్వత్రిక సమ్మెకు దూరంగా ఉంటున్నారు. సమ్మె చేస్తున్నట్లు ఐఎన్‌టీయూసీ, సీఐటీయూలు యాజమాన్యానికి నోటీసు ఇచ్చాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం యాజమాన్యం, యూనియన్ సంఘాల నాయకులు, కార్మికశాఖ అధికారుల సమక్షంలో చర్చలు జరిగాయి. చర్చల అనంతరం విద్యుత్ ఉప్పత్తి ప్రాజెక్టులో సమ్మెలు చేయడం భావ్యం కాదని ఇరువర్గాలు చర్చించిన పిదప సమ్మె నోటీసులను ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ నాయకులు ఉపసంహరించుకున్నారు. నిరసన ప్రదర్శనలతో సమ్మెకు మద్దతు తెలుపాలని నిర్ణయించారు. కాగా, సార్వత్రిక సమ్మెకు ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు సన్నద్ధమవుతున్నారు.
Advertisement
Advertisement