emplees
-
ఊళ్లు తిరిగే ఉద్యోగానికి రూ.72 లక్షల జీతం
పొద్దస్తమానూ ఆఫీసులో చేసినపనే చేస్తూ బోరు కొడుతోందా?...జీవితాంతం ఇల్లూ..పిల్లలే తప్ప మరో యావ లేక విసుగనిపిస్తోందా?..ఈ ఝంఝాటాలన్నీ వదిలేసి హాయిగా తిరిగేస్తూ బతకాలనిపిస్తోందా...అయితే, ఈ ఉద్యోగం మీ కోసమే. ఇది మాములు ఉద్యోగాల్లాంటిది కాదు! ఆఫీసు టైమింగ్సు, రూల్సు వంటివేమీ ఉండవు. మీరు చేయాల్సిందల్లా మీ బాస్‌తో కలసి విహార యాత్రలకు వెళ్లడం, మంచి మంచి ఫొటోలు తీయడం. దీనికి మీకొచ్చే జీతం ఎంతో తెలుసా... నెలకు రూ.72 లక్షలు! మీకు ఫొటోలు తీయడం బాగా వస్తే, ప్రయాణాలు చేయడం ఇష్టమయితే ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోండి. బ్రిటన్‌కు చెందిన ధనిక కుటుంబం ఒకటి ఈ ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోంది. వారికి ప్రపంచ వ్యాప్తంగా హాలిడే హోంలు, రిసార్టులున్నాయి. మీరు చేయాల్సింది వారి వెంట తిరగడం. పర్యటనకు సంబంధించి అద్భుతమైన ఫోటోలు తీయడం. మీ విషయాలన్నీ వాళ్లే చూసుకుంటారు. ఒకే ఒక ఇబ్బంది.. ఈ ఉద్యోగంలో ఏడాదికి నెల రోజులు సెలవు కూడా ఇస్తారండోయ్. అయితే వాళ్ల టూర్లకు అడ్డం కాకుండా సెలవు తీసుకోవచ్చు. 2019, ఫిబ్రవరి నుంచి ఈ ఉద్యోగం మొదలవుతుంది. ఉద్యోగంలో ఓ ఇబ్బందేమిటంటే కుటుంబంతో ఎక్కువగా గడిపే అవకాశం ఉండదు. ‘ఆ..దాందేముంది..నెలకి లక్షలకు లక్షలకు వస్తోంటే..కుటుంబంతో ఏదోలా మేనేజ్ చేసుకోవచ్చు’అంటారా...ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే పెర్ఫోకల్ సైట్‌కి వెళ్లి దరఖాస్తు పడేయండి. -
ప్రతి ఉద్యోగి ఓటేసేలా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోస్టల్ బ్యాలెట్‌పై యంత్రాంగం నిశిత దృష్టి సారించింది. ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్న ఉద్యోగులు, సిబ్బంది వంద శాతం తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. గత ఎన్నికల్లో 26.18 శాతం మందే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. ఇంత తక్కువ శాతం మంది ఓటేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న యంత్రాంగం.. ఈసారి ప్రతిఒక్కరూ ఓటేసేలా చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ విధానంపై దాదాపుగా అవగాహన కల్పించారు. మైక్రోఅబ్జర్వర్లకు మాత్రం వచ్చేనెల 2వ తేదీన తర్ఫీదు ఇవ్వనున్నారు. పది వరకు అవకాశం.. జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల విధుల్లో సుమారు 35 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది, ఇతరులు పాల్గొనున్నారు. వీరంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు ప్రతి నియోజకవర్గం పరిధిలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. నిర్దేశిత ఫార్మాట్లో ఫారంలను పూర్తి చేసి ఇక్కడ ఉన్న డ్రాప్ బాక్స్‌లో బ్యాలెట్‌ను వేయాల్సి ఉంటుంది. ఈనెల 27 నుంచి ఫారం–12లను (పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు పత్రం) ఉద్యోగులకు అందజేస్తున్నారు. వచ్చేనెల 3వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలను ఇవ్వనున్నారు. నిర్దేశిత ఫార్మాట్లో పూర్తిచేసి వచ్చేనెల 10వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్‌ను డ్రాప్ బాక్స్‌లో వేయొచ్చు. లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా ఉద్యోగుల ఓటు హక్కు ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ చిరునామాకు పంపొచ్చు. ఇప్పటివరకు 1,545 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. -
ఎమ్మెల్యే వర్సెస్ ఉద్యోగులు
-
సమ్మెకు ఎన్టీపీసీ ఉద్యోగులు దూరం
నోటీస్ ఉపసంహరించుకున్న ఐఎన్టీయూసీ, సీఐటీయూ జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం సంస్థ ఉద్యోగులు సార్వత్రిక సమ్మెకు దూరంగా ఉంటున్నారు. సమ్మె చేస్తున్నట్లు ఐఎన్టీయూసీ, సీఐటీయూలు యాజమాన్యానికి నోటీసు ఇచ్చాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం యాజమాన్యం, యూనియన్ సంఘాల నాయకులు, కార్మికశాఖ అధికారుల సమక్షంలో చర్చలు జరిగాయి. చర్చల అనంతరం విద్యుత్ ఉప్పత్తి ప్రాజెక్టులో సమ్మెలు చేయడం భావ్యం కాదని ఇరువర్గాలు చర్చించిన పిదప సమ్మె నోటీసులను ఐఎన్టీయూసీ, సీఐటీయూ నాయకులు ఉపసంహరించుకున్నారు. నిరసన ప్రదర్శనలతో సమ్మెకు మద్దతు తెలుపాలని నిర్ణయించారు. కాగా, సార్వత్రిక సమ్మెకు ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు సన్నద్ధమవుతున్నారు.