
రూ. 10,000 కోట్ల సమీకరణ!
ముంబై: పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌టీపీసీ అనుబంధ కంపెనీ.. ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల ఎంపికను చేపట్టినట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా పునరుత్పాదక రంగ కంపెనీ రూ. 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది.
తద్వారా 2022లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ తదుపరి అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తెరతీయనుంది. నిధులను సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా తదితర భవిష్యత్ ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలకు పెట్టుబడులుగా వెచ్చించనుంది. ఐపీవో కోసం ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్‌ను షార్ట్‌లిస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment