- ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ సెక్రటరీ జనరల్ బాబర్ సలీంపాషా
జ్యోతినగర్: కార్మికుల శ్రేయస్సే ధ్యేయంగా ఐఎన్‌టీయూసీ పనిచేస్తోందని యూనియన్ అనుబంధ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ సెక్రటరీ జనరల్ బాబర్ సలీంపాషా అన్నారు. టౌన్‌షిప్‌లోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. ఎన్టీపీసీ రామగుండం సంస్థ ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికలు సెప్టెంబర్ 13వ తేదీన జరుగనున్నాయని తెలిపారు. రామగుండం విద్యుత్ సంస్థలో 17 సార్లు ఐఎన్‌టీయూసీ విజయం సాధించి కార్మికుల హక్కులను పరిరక్షించిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఉద్యోగులు ఐఎన్‌టీయూసీ విజయానికి తోడ్పడాలని కోరార. కార్మిక శాఖ నేతృత్వంలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలు ఈసారి యాజమాన్యం ఆధ్వర్యంలో జరుగుతున్నాయని, విజయం సాధించిన యూనియన్æ కాలపరిమితి మూడు సంవత్సరాలు ఉంటుందన్నారు. ఐఎన్‌టీయూసీని నేరుగా ఎదుర్కొనలేక కొందరు పొత్తుల పేరుతో ముందుకు వస్తుండటాన్ని ఉద్యోగులు హర్షించరని పేర్కొన్నారు. మెరుగైన వేతన ఒప్పందంతోపాటు హక్కులు సాధించడం ఐఎన్‌టీయూసీకే సాధ్యమవుతుందన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బడికెల రాజలింగం మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థలో కొనసాగుతున్న డబ్ల్యూ–0 కేడర్‌ను తొలగించి దాని స్థానంలో డబ్ల్యూ–1గా మార్చేందుకు యూనియన్ పాటుపడుతుందని తెలిపారు. పొత్తులతో గెలిచిన యూనియన్ గతంలో హక్కులను సాధించకపోగా ఉన్న వాటిని కోల్పోవడానికి దోహదపడ్డాయన్నారు. చాలా కాలం టీఎన్‌టీయూసీలో కొనసాగిన జంగిలి మనోహర్‌రావు ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీలో చేరారు. ఆయనకు బాబర్ శాలువాకప్పి ఆహ్వానించారు. సమావేశంలో అజయ్‌ఘోష్, మల్లారెడ్డి, ఆరెపల్లి రాజేశ్వర్, ఉదయ్‌కుమార్, ప్రభాకర్, కమాలాకర్‌రావు, బండారి కనకయ్య, ఆరెపల్లి లక్ష్మీనారాయణ, కందుల స్వామి, కొలని వెంకటరెడ్డి, వేముల కృష్ణయ్య, వేణు, అఫ్జల్, రహీం, యుగంధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.