58 ఏళ్లు పైబడిన కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు ఎన్టీపీసీ (రామగుండం యూనిట్) సంస్థ నిర్ణయం తీసుకుంటు న్నట్లు సమాచారం.
కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు ఎన్టీపీసీ నిర్ణయం?
జ్యోతినగర్(రామగుండం): 58 ఏళ్లు పైబడిన కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు ఎన్టీపీసీ (రామగుండం యూనిట్) సంస్థ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఎన్టీపీసీలో పని చేస్తుండగా, జరిగిన ప్రమాదంలో గాయపడిన కాంట్రాక్టు కార్మికుడు సంపత్‌రావు (55) ఇటీవల మృతిచెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో కార్మికులు గేట్ వద్ద నిరసన చేపట్టారు.
ఆ తర్వాత చర్చల అనంతరం మృతుడి కుటంబానికి రూ.8.5 లక్షలు, రూ.40 వేలు, దహన సంస్కారాలకు, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు కార్మికుడిగా నియమించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సంస్థలో 58 ఏళ్లు నిండిన కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.